హైదరాబాద్ నుండి అయోధ్యలో ఉన్న రాముడికి పాదుకలు..! తయారు చేసిన వ్యక్తి ఎవరంటే..?

హైదరాబాద్ నుండి అయోధ్యలో ఉన్న రాముడికి పాదుకలు..! తయారు చేసిన వ్యక్తి ఎవరంటే..?

by kavitha

Ads

హిందువులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న అపూర్వమైన గడియలు అసన్నమవుతున్నాయి. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరరంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరుగనుంది. ఈ వేడుకను అత్యంత గ్రాండ్ గా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Video Advertisement

హిందువులందరి కలను నిజం చేస్తూ అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరనున్నారు. అయోధ్య రామమందిరానికి 118 దర్వాజాలు హైదరాబాద్ లోని బోయినపల్లి అనురాధ టింబర్ డిపోలో తయారు అయిన విషయం తెలిసిందే. రామయ్యకు బంగారు పాదుకలు సైతం హైదరాబాద్ లోనే రూపొందాయి. ఆ పాదుకలను తయారుచేసిన శిల్పి ఎవరో ఇప్పుడు చూద్దాం..
500 ఏళ్ళ పోరాటం తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాకారం అయ్యింది. ఇది కోట్లాది మంది హిందువుల కల. అందువల్లే రామ మందిరం నిర్మాణం కోసం కోట్ల రూపాయల రామ భక్తులు అందించారు. అయోధ్య రామ మందిర నిధి సేకరణలో దేశంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రామమందిరం కోసం కావాల్సిన 118 దర్వాజాలు హైదరాబాద్ లోనే రూపొందాయి.
ఇక అయోధ్య రామయ్య కోసం బంగారు పాదుకలను తయారు చేసే అదృష్టం కూడా హైదరాబాద్ కే దక్కింది. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ వారు దాదాపు రూ.1.03 కోట్ల విలువ కల బంగారం పాదుకలను అయోధ్యకు  పంపించింది. భక్తుల ఈ పాదుకలను శ్రీరామ భజనలతో పాదయాత్రగా తీసుకెళ్లారు. శ్రీ రాముడికి పాదుకలు తయారు చేసి పంపించడం తమ సంస్థ చేసుకున్న భాగ్యమని సీతారామ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ చల్లా శ్రీనివాస్‌ శాస్త్రి వెల్లడించారు.
సుమారు పదమూడు కేజీల బరువుతో చేసిన వెండి పై బంగారు తాపడంతో తయారు చేసిన పాదుకలను సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో హస్మత్ పేటలోని శ్రీ మద్విరాట్ కళా కుటీర్ లో రూపొందించారు. లోహశిల్పి పిట్టంపల్లి రామలింగా చారి ఈ పాదుకలను ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి రూపొందించారు. ఆలయ ట్రస్ట్ ఈ బంగారు పాదుకలను ఇప్పటికే అయోధ్య రామ మందిరంకు చేర్చారు.

Also Read: RAM MANDHIR VIP ACCESS FAKE MESSAGE: అయోధ్యకి వీఐపి యాక్సెస్ ఉంటే వచ్చే ఆ మెసేజ్ లు నమ్మకండి.!

 

 

 


End of Article

You may also like