Ads
ఇవాళ మొహాలీలో శ్రీలంకతో టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇది విరాట్ కోహ్లీకి ఒక ప్రత్యేకమైన మ్యాచ్ అవ్వనుంది. అందుకు కారణం, విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ పూర్తి చేయడమే. మొహాలీలో విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. కోహ్లీ కంటే ముందు 11 మంది క్రికెటర్లు ఈ ఘనతని సాధించారు. విరాట్ కోహ్లీ 99 టెస్ట్ మ్యాచ్‌లలో 27 సెంచరీలు చేశారు.
Video Advertisement
50.39 యావరేజ్ తో 7962 పరుగులు చేశారు. 99 టెస్ట్ ల తర్వాత మరి కొంతమంది ఇండియన్ బ్యాట్స్మెన్ల యావరేజ్ ఎంత, వారు ఎన్ని పరుగులు చేశారో ఇప్పుడు చూద్దాం.
#1 వీరేంద్ర సెహ్వాగ్
సెహ్వాగ్ 50.84 యావరేజ్ తో 8,448 పరుగులు చేశారు. అందులో 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు సాధించారు.
#2 రాహుల్ ద్రవిడ్
99 టెస్ట్ మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రావిడ్ యావరేజ్ 58.16 ఉంది. ద్రవిడ్ 8492 పరుగులు చేశారు. అందులో 22 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
#3 సునీల్ గవాస్కర్
99 టెస్ట్ మ్యాచ్‌లలో సునీల్ గవాస్కర్ 53.46 యావరేజ్‌తో 8394 పరుగులు చేశారు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి.
#4 సౌరవ్ గంగూలీ
గంగూలీ 43.17 యావరేజ్ తో 6346 పరుగులు చేశారు. అందులో 15 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
#5 దిలీప్ వెంగ్‌సర్కార్
దిలీప్ వెంగ్‌సర్కార్ 99 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత 46.21 యావరేజ్ తో 6331 పరుగులు చేశారు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించారు.
#6 వివిఎస్ లక్ష్మణ్
వివిఎస్ లక్ష్మణ్ 1999 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత 45.41 యావరేజ్ తో 6313 పరుగులు చేశారు. అందులో 13 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
#7 సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ 99 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత 57.99 యావరేజ్ తో 8351 పరుగులు చేశారు. అందులో 30 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించారు.
End of Article