Ads
ఆదివారం 2023 వండే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాదిమంది భారతీయులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు మ్యాచ్ మొదలవుతుందా అంటూ వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తున్నారు. చాలా చోట్ల లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 150 కోట్ల భారతీయులు అందరూ ఏకతాటిపై వచ్చి భారత్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాపై భారత్ ఫైనల్ మ్యాచ్ లో కప్పు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Video Advertisement
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ పైన భారత్ మాజీ కెప్టెన్ బిసిసిఐ మాజీ చైర్మన్ సౌరభ్ గంగూలీ స్పందించారు.ఇండియన్ టీం భీకరమైన ఫామ్ లో కనిపిస్తుందని ఈ మ్యాచ్ లో నెగ్గి ఆస్ట్రేలియాను ఓడించాలని అతను ఆకాంక్షించారు. ఇప్పటివరకు రోహిత్ సేన అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని మెచ్చుకున్నారు.అలాగే ఆస్ట్రేలియా టీం కూడా మంచి ఫామ్ లో ఉండటం మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని అన్నారు.
అలాగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. టాస్ వేసిన అనంతరం 01:35 నుండి 01:50 భారత్ వాయుసేన ఆధ్వర్యంలో సూర్య కిరణ్ ఎయిర్ బాటీక్ బృందం ఎయిర్ షో చేయనుంది. మొదటి ఇన్నింగ్స్ డ్రింక్ విరామంలో ప్రముఖ గేయ రచయిత, గాయకుడు గద్వితో సంగీత కార్యక్రమం, తొలి ఇన్నింగ్స్ విరామంలో జోనిత గాంధీ, ప్రీతమ్, తుషార్ జోషి నేతృత్వంలో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండో ఇన్నింగ్స్ విరామ సమయంలో లేజర్ షో లైట్ షో నిర్వహించనున్నారు.
అలాగే ప్రపంచ కప్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి అలాగే ముంబై నుండి అహ్మదాబాద్ కి రైల్వే శాఖ ప్రత్యేక రైలు లను నడపనుంది. ఈ ప్రపంచ కప్పును చూసేందుకు సినిమా, రాజకీయ దిగ్గజాలందరూ అహ్మదాబాద్ వెళ్ళనున్నారు. కోట్లాదిమంది భారతీయులు టీవీ ముందు సిద్ధంగా ఉన్నారు. ఇండియా కప్పు కొట్టాలని అందరూ ఆకాంక్షిద్దాం. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.
Also Read:రోహిత్ గిల్‌ని ఎందుకు వెనక్కి పిలిచాడు?
End of Article