ఐపీఎల్ 2023 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది.

Video Advertisement

ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందు నుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయం పై ఆసక్తి నెలకొంటుంది.

 

ఇదిలా ఉంటే తాజాగా మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా మంది ప్లేయర్స్ ని వదిలేసుకుంది. పైగా కెప్టెన్ పరంగా కూడా మార్పులు చేసారు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. జట్లు చాలా మంది ఆటగాళ్లను వదులుకోవడం జరిగింది. దీంతో ఈ మినీ వేలంపై అభిమానుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్ని కీలక మార్పులు చేసింది. 2019 లో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్‌ ని కాకుండా కేన్ విలియమ్సన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. విండీస్ స్టార్ నికోలస్ పూరన్‌ను కూడా వదిలేసింది హైదరాబాద్.

ఈ విధంగా మొత్తం 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేయడం జరిగింది. కేన్ విలియమ్సన్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంటుండగా రూ.10.75 కోట్లుగా పూరన్ ధర వుంది. ఇలా ఈ ఇద్దరి మీద రూ.25 కోట్లు ఆదా చేసారు. అలానే ఇతర ఆటగాళ్ల మీద రూ.20 కోట్ల దాక మిగుల్చుకుంది. ఇలా కావ్య రూ.42.25 కోట్ల తో వేలానికి వెళ్తోంది. విలియమ్సన్‌ను వదిలేయడం తో ”సన్‌రైజర్స్ తర్వాతి కెప్టెన్ భువీ ఏనా” అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేసారు. మరి ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కి కెప్టెన్ గా భువి ఉంటాడా లేదా ఇంక ఎవరైనా కెప్టెన్ గా వుంటారా అనేది చూడాల్సి వుంది.