”బిగ్ బాస్ సీజన్ 6” నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

”బిగ్ బాస్ సీజన్ 6” నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

by Megha Varna

Ads

బిగ్ బాస్ సీజన్ 6 చాలా కొత్తగా ఉంది. ఏ సీజన్ లో లేనట్లుగా షాకింగ్ ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ యొక్క ఇంటి సభ్యులు వస్తున్నారు. ఇప్పటికే అందరి ఇంటి సభ్యులు వచ్చారు. కేవలం సింగర్ రేవంత్ ఇంటి సభ్యులు మాత్రమే రావాల్సి ఉంది. వారి కోసం రేవంత్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.

Video Advertisement

ఇక ఇది ఇలా ఉంటే ఈసారి కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఫైమా కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరి ఫైమా ఈ ఫ్రీ పాస్ ని ఉపయోగించనుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

ఒకవేళ కనుక ఈ వారం ఫైమా ఈ ఫ్రీ పాస్ ని ఉపయోగిస్తే డబల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి అవ్వదు. అయితే ఈమె ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఉపయోగించే దాని ప్రకారం ఎలిమినేషన్ తారుమారై పోతుంది. ఈవారం పైమా, ఆదిరెడ్డి, రాజ్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. టాప్ లో ఇనాయ సుల్తానా ఉంది. శ్రీహాన్, రోహిత్ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు.

Bigg Boss 6 Faima

Bigg Boss 6 Faima

ఆ తర్వాత శ్రీ సత్య కూడా సేఫ్ జోన్ లోనే ఉంది. శ్రీ సత్య తల్లిదండ్రులు రావడం వలన ఆమెకి మరింత ఫ్యాన్
బేస్ పెరగచ్చు. కానీ రాజ్, ఆదిరెడ్డి, ఫైమా వీళ్లిద్దరూ కూడా ఆఖర స్థానాల్లో ఉన్నారు. ఫైమా పాస్ ని ఉపయోగించుకుంటే ఆదిరెడ్డి, రాజ్ లో ఒకరు వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే సీజన్ సిక్స్ లో ఊహించని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సూర్య, గీతూ కూడా అంత త్వరగా వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. మరి ఈసారి కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్, ఆది రెడ్డి లో ఒకరు వెళ్తారా లేదంటే ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో షాకింగ్ ఎలిమినేషన్ వుంటుందా అనేది చూడాల్సి వుంది.


End of Article

You may also like