కూలి పని చేసాను… డబ్బు లేకపోవడంతో చాలా అవమానించారు..! తన కన్నీటి గాథ ని చెప్పిన ఫైమా..!

కూలి పని చేసాను… డబ్బు లేకపోవడంతో చాలా అవమానించారు..! తన కన్నీటి గాథ ని చెప్పిన ఫైమా..!

by Megha Varna

Ads

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Video Advertisement

వరుసగా నాగార్జున నాలుగో సారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.

Bigg Boss 6 Faima

Bigg Boss 6 Faima

ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు 72 రోజులు పూర్తి చేసుకుంది. ప్రైజ్ మనీకి సంబంధించిన గేమ్ అయ్యింది నిన్న. దేనికి ఈ ఫ్రీజ్ మనీని ఉపయోగిస్తారు అని బిగ్ బాస్ అందరినీ చెప్పమని అడుగుతాడు. దాంతో సభ్యులు ఒకరి తరువాత ఒకరు వాళ్ళ ఉద్దేశం చెబుతారు. ఫైమా మాట్లాడి తన కష్టాలని చెప్పింది. ఫైమా వాళ్ళు నాలుగురట. అందుకే వాళ్ళ అమ్మ గారు ఎంతో కష్టపడి వాళ్ళని పెద్ద చేశారట.

ఓ చిన్న గదిలో వీళ్ళు అద్దెకి ఉండేవారట. ఫైమా కూడా కూలి పనికి వెళ్లేదానినని చెప్పింది. పత్తి ఏరడానికి తానూ వెళ్లేదానినని రోజుకి 100 రూపాయలు వచ్చేవి అని చెప్పింది ఫైమా. ఈ డబ్బులని చాలా జాగ్రత్తగా ఖర్చు చేసేవారట. వీళ్ళు వుండే చోట ఎక్కువ అద్దె చెల్లిస్తామని ఎవరైనా వస్తే ఖాళీ చేసేయాల్సి వచ్చేది అని ఫైమా అంది. ఖాళీగా ఇల్లు వున్నా లేదని చెప్పేవారట. మీరు రెంట్ ఇవ్వలేరు మరో ఇల్లు చూసుకోమని కూడా కొందరు అనేవారట. ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం అని… సొంత ఇల్లుని అమ్మకి బహుమతిగా ఇవ్వాలని ఉందని. విన్నర్ అయితే ఆ డబ్బుని ఇలా ఉపయోగిస్తాను అని ఫైమా అంది.


End of Article

You may also like