బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ అతడేనా..?? ముందే ఫిక్స్ అయ్యారా..??

బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ అతడేనా..?? ముందే ఫిక్స్ అయ్యారా..??

by Anudeep

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 కి మరో పదిరోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. డిసెంబర్ 18 ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే హౌస్‌లో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఇనయ.. ఈ ఏడుగురు టైటిల్ రేస్‌లో ఉన్నారు. ఈ వారంలో ఇద్దర్ని డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇంటికి పంపి.. టాప్ 5 కంటెస్టెంట్స్‌ని గ్రాండ్ ఫినాలేకి పంపబోతున్నారు. వీళ్లలో విన్నర్ ఎవరనే దానిపై ఆసక్తికరమై చర్చ నడుస్తోంది.

Video Advertisement

బిగ్ బాస్ టీంతో పాటు హోస్ట్ నాగార్జున మొదటి నుంచి సింగర్ రేవంత్‌ పట్ల పాజిటివ్‌గా ఉండి.. అతనికి సపోర్ట్‌గా ఉండటంతో.. విన్నర్ అతనే అన్న చర్చ నడుస్తోంది. పైగా ఇక రేవంత్ కూడా.. గ్రాండ్ ఫినాలేలో నాగార్జున గారు పైకి ఎత్తేది తన చేయే అని.. ఈ చేత్తో టైటిల్‌ని ఇలా పట్టుకుంటా.. ఆ ప్రైజ్ మనీ మొత్తం నాదే.. సువర్ణభూమి ఫ్లాట్ కూడా నాదే అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు.

 biggboss 6 winner confirmed..??

ఎంత నెగిటివిటీ ఉన్నా.. రేవంత్ గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్ కావడంతో ఆ క్రేజ్‌తో ఓటింగ్‌లో అతనే టాప్ ఉంటున్నాడు. దీంతో రేవంత్ విన్నర్ కావడం ఖాయం అని బిగ్ బాస్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది. అలాగే ఈ సీజన్‌లో అయితే రూ.25 లక్షలు విలువ చేసే ఫ్లాట్‌ని విన్నర్‌కి అందిస్తున్నారు.

 biggboss 6 winner confirmed..??

మొన్నటి వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున.. బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ప్రైజ్ మనీ గురించి మాట్లాడుతూ.. గెలిచిన కంటెస్టెంట్‌కి ప్రైజ్ మనీతో పాటు.. రూ.25 లక్షల ఫ్లాట్ ఉచితంగా సువర్ణభూమి వాళ్లు అందిస్తారని ప్రకటించారు. ఆ టైంలో హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లు.. ఆదిరెడ్డి, కీర్తి, ఇనయ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, రోహిత్‌లను నిలబెట్టి ఈ విషయం చెప్పడంతో.. ఈ ఆరుగురు చప్పట్లు కొడుతూ కనిపించారు.

 biggboss 6 winner confirmed..??

అయితే ఇక్కడ పిక్చర్‌ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆరుగురికి సెంటర్‌లో ఉన్న రేవంత్ .. కళ్లు మూసుకుని కృత‌జ్ఞతగా దండం పెడుతూ కనిపించాడు. మిగిలిన వాళ్లలో ఎక్స్ ప్రెషన్స్ చూస్తే అభినందిస్తున్నట్టుగా కొంతమంది.. అవకాశం చేజారినట్టుగా మరికొంత మంది ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు కానీ.. రేవంత్ మాత్రం.. ‘థాంక్యూ దేవుడా.. బిగ్ బాస్ విన్నర్ టైటిల్ నాదే.. ఆ సువర్ణభూమి వాళ్ల ఫ్లాట్ కూడా నాదే’ అన్నట్టుగా కళ్లు మూసుకుని కృత‌జ్ఞత తెలిపేశాడు.

 biggboss 6 winner confirmed..??

బిగ్ బాస్ వాళ్లు ముందే చెప్పారో.. లేదంటే నాగార్జున హమీ ఇచ్చారో.. ఏమైందో ఏమో కానీ.. రేవంత్ ఇప్పుడే కాదు.. సీజన్ స్టార్ట్ అయిన మూడో వారం నుంచే టైటిల్ నాదే అని ధీమాగా చెబుతున్నాడు. నిజానికి ఓటింగ్ పరంగా చూస్తే.. ఉన్న వాళ్లలో క్రేజ్ ఉన్నది అతనికే. కానీ అతని బిహేవియర్‌తో ఆ క్రేజ్‌ని చెడగొట్టుకుంటున్నాడు. ఎదుటివాళ్లు గెలవకూడదనే స్వార్ధం.. ఎవరైనా గెలిస్తే ఉడుకుబోతుతనం.. పదే పదే నోరు జారటం.. మాట మీద నిలబడలేకపోవడం.. అబద్ధాలు ఆడటం.. తప్పుని ఒప్పుకోకపోవడం లాంటివి రేవంత్‌కి మైనస్ అవుతున్నాయి.

 biggboss 6 winner confirmed..??

కానీ ఉన్న వాళ్లలో కాస్త క్రేజ్ ఉన్నది రేవంత్‌కే. పైగా అతను ఇండియన్ ఐడల్ విన్నర్ కూడా. ఆ క్రేజ్‌తోనే అతనికి ఓట్లు పడుతున్నాయి తప్పితే.. బిగ్ బాస్‌లో అతని ప్రవర్తన చూసి కాదనే మాట ఎక్కువ వినిపిస్తుంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియాలంటే ఫినాలే వరకు ఎదురు చూడాల్సిందే.


You may also like

Leave a Comment