బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో రెండవ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుండి బయటికి వచ్చారు ఉమా దేవి. హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాల కారణంగా చర్చల్లో నిలిచారు ఉమా దేవి. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనకి వచ్చిన రెమ్యూనరేషన్ తో ఎంతో గొప్ప పని చేశారు ఉమా దేవి. బిగ్ బాస్ ద్వారా ఉమా దేవికి వచ్చిన రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి అందించారు.
ఈ విషయం గుర్తించిన నెటిజన్లు ఉమా దేవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంత మంది, “అలా ఒక ప్రాణాన్ని కాపాడిన ఉమా దేవికి అంతా మంచే జరగాలి” అని కోరుకుంటూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం “ఉమా దేవి మళ్లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా షోలోకి తిరిగి అడుగు పెట్టాలి” అని కామెంట్స్ చేస్తున్నారు.



ఎపిసోడ్స్ గడిచేకొద్దీ షోలో రోజు రోజుకి వివాదాలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క రోజు కంటెస్టెంట్స్ అందరూ బాగా మాట్లాడుకుంటారు. కానీ మళ్లీ కొద్ది రోజులకి గొడవలు మొదలవుతున్నాయి. ఇలా ఇప్పటికీ చాలా కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇలా కొన్ని గొడవలు, కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ మూడవ వారంలోకి అడుగు పెట్టింది. ఇటీవల బిగ్ బాస్ ఎపిసోడ్ లో నామినేషన్ సందర్భంగా జరిగిన ఘటన చర్చలకు దారి తీసింది.
































