ఎన్నో హిందీ సినిమాల్లో నటించి ఎంతో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మీనా కుమారి గారు. మీనా కుమారి గారి అసలు పేరు మెహజబీన్ బానో. మీనా కుమారి గారు ఆగస్టు 1వ తేదీ 1933 లో జన్మించారు. మీనా కుమారి తండ్రి కూడా కొన్ని సినిమాల్లో నటించడం తో పాటు, మ్యూజిక్ అందించడం, హార్మోనియం వాయించడం ఉర్దూ కవిత్వం రాస్తూ ఉండడం అలాగే మ్యూజిక్ కూడా నేర్పిస్తూ ఉండేవారు.
మీనా కుమారి గారు థియేటర్ ఆర్టిస్టుల కుటుంబంలో జన్మించారు. మీనా కుమారి గారు తనకి నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టారు. 1940లో ఏక్ హీ భూల్ అనే సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ అయిన విజయ్ భట్ మెహజబీన్ ని బేబీ మీనా గా మార్చారు. తర్వాత ఆ పేరుతో ఎన్నో సినిమాలు చేశారు మీనా కుమారి గారు.
మీనా కుమారి గారు కమల్ ఆమ్రోహి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు. మీనా కుమారి గారు తన ఎడమచేతిని కప్పి ఉంచేవారు. చాలా సినిమాల్లో ఈ విషయం చూసే ఉంటారు కానీ దీనికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు.
కమల్ ఆమ్రోహి కొడుకు తజ్దార్ ఆమ్రోహి ఒక సందర్భంలో మాట్లాడుతూ మే 21వ తేదీ 1951లో మీనా కుమారి గారు మహాబలేశ్వర్ నుండి ముంబైకి వస్తున్నప్పుడు మీనా కుమారి గారి కార్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ తర్వాత మీనా కుమారి గారు చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు. అందులో మీనా కుమారి గారి చిటికెన వేలు విరిగింది. దాంతో వేలి యొక్క ఆకారం మారి రౌండ్ గా అయ్యింది.
అందుకే మీనా కుమారి గారు తర్వాత నటించిన సినిమాల్లో తన ఎడమ చేయిని కప్పి ఉంచేవారు. తనకి 38 సంవత్సరాల వయసున్నప్పుడు మీనా కుమారి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న బెస్ట్ యాక్ట్రెస్ ల జాబితాలో మీనా కుమారి గారి పేరు ముందు ఉంటుంది.