ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా విడుదల అయ్యింది. దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడి ఇప్పుడు విడుదల అయ్యింది. ఈ సినిమా కేవలం కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగం మాత్రమే. ఈ సినిమా తర్వాత కొనసాగింపుగా ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ కూడా నెక్స్ట్ పార్ట్ కి ప్రశ్న లాగా ఉండేలాగానే ముగించారు.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాత్రలని పరిచయం చేయడంతోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్ లోనే అసలు కథ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వెళుతున్నంతసేపు కూడా సాధారణంగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సమయంలో సినిమా ఒక మంచి సీన్ తో ముగుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుండి సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నారు. ఇంటర్వెల్ సినిమాకి చాలా పెద్ద హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత నుండి సినిమా పరిగెడుతూనే ఉంటుంది. ఎంతో మంది నటీనటులు ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. వాళ్లని తెర మీద చూస్తేనే బాగుంటుంది.
కొంత మంది నటులు కనిపించే స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందరి పాత్రలని చూపించారు కానీ, కృష్ణుడి పాత్రను మాత్రం చూపించలేదు. అంటే పాత్రను చూపించారు. కాకపోతే కృష్ణుడి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు అనేది చూపించలేదు. ఆ పాత్రలో నటించింది ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించిన యాక్టర్ పేరు కృష్ణ కుమార్. కృష్ణ కుమార్ తమిళ్ నటుడు. సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో హీరో ఫ్రెండ్ పైలట్ గా నటించారు. ఇప్పుడు కల్కి సినిమాలో కూడా నటించారు. ఈ విషయాన్ని కృష్ణ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కృష్ణుడి పాత్రని పోషించినట్టు కృష్ణ కుమార్ పోస్ట్ చేసారు.









మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీని సొంత ప్రొడక్షన్ హౌజ్ లో మమ్ముట్టి నిర్మించారు. ఈ యాక్షన్-మిస్టరీ థ్రిల్లర్ మూవీకి రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆడియెన్స్ డిమాండ్ మేరకు 25 కొత్త కేంద్రాలలో 70 అదనపు షోలను ప్రారంభించారు.
ఇక కథ విషయాని వస్తే, ఇక ఒక రాజకీయ నాయకుడి ఇంట్లోవారిని హత్య చేసి, ఇంట్లోని నగలు డబ్బును కొందరు దోచుకుని వెళ్తారు. ఈ కేసును చేధించడానికి కన్నూర్ స్క్వాడ్ ను నియమిస్తారు. ఈ స్క్వాడ్ ఏఎస్ఐ జార్జ్(మమ్ముట్టి ) నేతృత్వంలోని నలుగురు సభ్యుల ప్రత్యేక పోలీసుల దర్యాప్తు బృందం. ఏఎస్ఐ జార్జ్, అతని టీమ్ ఈ కేసును ఎలా చేధించారు అనేది మిగిలిన కథ.
సినిమాటోగ్రాఫర్ రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీతో దర్శకుడిగా మారారు. సినిమా కథనం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు, సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ చిత్రం సెకండాఫ్ శరవేగంగా సాగుతూ, ఆశ్చర్యం కలిగిస్తుంది. మమ్ముట్టి ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. మమ్ముట్టి చెప్పే ‘మాస్’ డైలాగ్లు ఆడియెన్స్ ను అలరిస్తాయి.















