నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుని, టాలీవుడ్ లో అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. బాలయ్యకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
బాలకృష్ణ వారసుడుగా ఆయన తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బొద్దుగా ఉండే మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతారా అనే సందేహాలు ఉండేవి. కానీ మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజెన్లు ఎంత మారిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఎప్పుడూ చూద్దాం..
నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సార్లు గతంలో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని ఈవెంట్స్ లో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు వైరల్ అవడంతో మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతాడా నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే బాలయ్య లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. మోక్షజ్ఞ ఎంట్రీ నేపథ్యంలో యాక్టింగ్, డాన్స్ వంటి విషయాల్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
బొద్దుగా కనిపించే మోక్షజ్ఞ ఊహించని విధంగా స్లిమ్ లుక్ లో కనిపించారు. మోక్షజ్ఞ తన స్నేహితులతో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులకు నందమూరి లెగసీని మోక్షజ్ఞ కొనసాగిస్తాడని అంటున్నారు.








































అయితే తాజాగా విడుదలైన సినిమాలకి కాకుండా ఎప్పుడో విడిపోయిన సినిమాల్లో కూడా ఈ తప్పులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర 25000 డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అని తిరిగి ఇవ్వాలని అంటాడు. ఇక దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మలయాళ నటుడు మరియు నిర్మాత అయిన కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా 2022 లో ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గాను హిట్ గా నిలిచింది. 5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏనాట గా హిట్ అయ్యింది అంటే బాలీవుడ్ చిత్రాలైన అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల స్క్రీన్ కౌంట్‌ను తగ్గించి, ఆ థియేటర్లను ఈ చిత్రం మరిన్ని షోలను వేశారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ కోజుమ్మల్ రాజీవ్ కూలీ పని చేసే తమిళ అమ్మాయి దేవిని ఇష్టపడతాడు. ఆమె కోసం దొంగతనాలు మానేసి, కూలీగా మారుతాడు. ఆమె ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు గుడి లో జరిగే భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో ను నుండి తప్పించుకుందేనందుకు, పక్కనే ఉన్న ఇంటి గోడ దూకడంతో అక్కడి పెంపుడు కుక్కలు కరుస్తాయి.
వాటి అరుపులకు లేచిన ఇంట్లో వారు అతడి పై దొంగతనం ఆరోపణలు చేస్తారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు వెనటనే అరెస్ట్ చేస్తారు. కేసు కొరత్కు వెళ్తుంది. కోర్టులో, రాజీవ్ తనకు తెలిసిన పోలీసుగా మారిన న్యాయవాది సహాయంతో తన కేసును తనే స్వయంగా వాదించి, సాక్ష్యాలను తెస్తానని వాగ్దానం చేస్తాడు. అతను సాక్ష్యాలను ఎలా సంపాదించాడు. కోర్టులో ఎలా నిర్దోషి అని నిరూపించుకున్నాడనేది మిగతా స్టోరీ.
ఈ చిత్రాన్ని దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ చెప్పాలను కున్న పాయింట్ ను చక్కగా, చాలా సహజంగా తెర పై చూపించాడు. కామెడీ సన్నివేశాలు, కుంచాకో బోబన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా గాయత్రీ శంకర్ నటించారు. డాన్ విన్సెంట్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు


