మంచి విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తరికెక్కుతున్న చిత్రం భక్తకన్నప్ప. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఈ చిత్రాన్ని నిర్మాత మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది మంచు ఫ్యామిలీ డ్రీమ్ సబ్జెక్టుగా చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రంలో సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మోహన్ బాబు అందించారు. ఈ చిత్రం కోసం ఏకంగా 600 మంది హాలీవుడ్ టెక్నీషియన్ పనిచేసినట్లుగా తెలిపారు. వందమందికి పైగా భారతీయ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలియజేశారు.90 రోజులపాటు ఒక షెడ్యూల్ కొనసాగిందని అన్నారు. న్యూజిలాండ్ లో అందమైన లోకేషన్ లో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుందని, దేవుడి దయ వల్ల ఎటువంటి అడ్డు లేకుండా ఈ చిత్రం షూటింగ్ ముందుకు కదులుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహాభారత్ సీరిస్ ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది












ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించిందని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా సలార్ మూవీలో ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడని టాక్. కథపరంగా ఎలా ఉన్నా సినిమాలో ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఉండడంతో ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట్లో ఎక్కడ చూసినా సలార్ మేనియా కనిపిస్తోంది.
అయితే ‘సలార్’ టీజర్ లో ఓ తాత, హీరో ప్రభాస్‌ని ‘డైనోసర్’తో పోల్చడం తెలిసిందే. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి కూడా ‘డైనోసర్ ఎపిసోడ్’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పడం తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన తరువాత జక్కన్నతో పాటు , ఫ్యాన్స్, ఆడియెన్స్ నిరాశ పడినట్టున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘సలార్ పార్ట్-1’ లో ఆ ఎపిసోడ్ మిస్ అయ్యింది. బహుశా పార్ట్-1 లో ఉండొచ్చేమో.
ఈ సన్నివేశం మాత్రమే కాకుండా మరో రెండు సన్నివేశాలు కూడా సలార్ పార్ట్-1 మిస్ అయినట్టు తెలుస్తోంది. సూరిడీ పాటలో భయపడి లేచిన పృధ్వీ రాజ్ తో ‘ఒరే నేనున్నా కదా పడుకో’ అంటూ ప్రభాస్, కి చెప్పే సీన్ కాగా, మూడవది కార్ సీన్, దాంతో ఈ సీన్స్ ఎందుకు పెట్టలేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సీక్వెల్ లో ఈ సీన్స్ ఉంటాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నటుడు రాజ్ బి. శెట్టి కన్నడ చిత్రసీమలో ఓ ట్రెండ్ ను సృష్టించారు. ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించారు. శెట్టి నటుడు మాత్రమే కాదు దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ కూడా. ఆయన నటించే చిత్రాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. యుక్ మొత్తే కతి, గరుడ గమన వృషభ వాహన చిత్రాలలో విభిన్నమైన కథలతో ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టిలకి మంచి స్నేహితుడు. ఈ ముగ్గురి నుండి సినిమా వస్తుందంటే కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఈ ఏడాది రాజ్ బి. శెట్టి మరొక డిఫరెంట్ మూవీ ‘టోబి’ తో ఆడియెన్స్ ని పలకరించారు. టోబి మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లీవ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, టోబీ ఒక విడిచిపెట్టిన పిల్లవాడు. చిన్నతనంలో అనేక వేధింపులకు గురి అవుతాడు. అతనికి పేరు కూడా లేదు. ఆ పిల్లవాడికి ఆశ్రయం ఇచ్చినవారు టోబీ అని పిలుస్తారు.
టోబీ కోపం ఎక్కువగా ఉంటుంది. అతనికి కోపం వచ్చినపుడు చంపేస్తాడు. టోబీతో పాటు అతని కోపం కూడా పెరుగుతుంది. విపరీతమైన కోపం వల్ల అతను పాపులర్ అవుతాడు. అతనికి నచ్చినవారు చెబితేనే ఏదైనా వింటాడు. అయితే కొందరు వ్యక్తిని కొందరు టోబీని స్వార్ధం కోసం వాడుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న టోబీ ఏం చేశాడు? వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.




