కొత్తగా రిలీజ్ అయిన ఈ సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

కొత్తగా రిలీజ్ అయిన ఈ సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

by Mounika Singaluri

Ads

మలయాళ సినిమాలు చాలా వైవిద్యంగా ఉంటాయి. చాలా సింపుల్ స్టోరీని తీసుకుని బాగా ఎంగేజింగ్ చెప్పడంలో మలయాళీ దర్శకులు ఆరి తేరిపోయారు.

Video Advertisement

ఓటిటి ల పుణ్యమా అంటూ మలయాళం సినిమాలు ప్రతిదీ కూడా తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి.
అలా వచ్చిన మూవీని ఫలిమీ… డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకున్న లేదా అనేది చూద్దాం…!

malayalam movie released on ott recently

అనూప్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. హిందీ సీరియల్ హే సులోచనాలో హీరో క్యారెక్టర్ కి డబ్బింగ్ చెబుతాడు. అనూప్ తండ్రి (జగదీశ్) ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు. ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్ నడిపేవారు అది లాభసాటిగా లేకపోవడంతో మూసేశారు. అనూప్ తల్లి (మంజూ పిళ్ళై) వేరే ప్రెస్‌లో ఉద్యోగానికి వెళుతుంది. విదేశాలు వెళ్లాలని అను తమ్ముడు (సందీప్ ప్రదీప్) కలలు కంటూ ఉంటాడు.కాశీకి వెళ్లాలని ప్రయత్నించే తాతయ్య (మీనరాజ్), పెళ్లి చేసుకోవాలని 15 సంబంధాలు చూసిన అనూప్ ఇలా ఒకరితో మరొకరికి సత్సంబంధాలు లేని ఫ్యామిలీ వీళ్లది.

malayalam movie released on ott recently

అనూప్ మూడు నెలల క్రితం చూసిన అమ్మాయి అనఘా (రైనా రాధాకృష్ణ)పెళ్లికి ఒకే చెప్పడంతో పెళ్లికి సిద్ధమవుతారు. నిశ్చితార్థం రోజున అనఘా వెనుక తాను ఐదు నెలలు పాటు తిరిగానని గొడవ చేయడంతో మండపం నుంచి అనూప్ కోపంగా ఇంటికి వెళతాడు, దాంతో పెళ్లి ఆగుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి కాశీ వెళతారు. కాశీ ప్రయాణంలో అనూప్ ఫ్యామిలీకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయాయి? చివరకు ఏమైంది? అనేది మిగతా కథ….!

malayalam movie released on ott recently

కాలేజ్ ఫ్రెండ్స్ లేదా ప్రేమికులు విహారయాత్రకు వెళ్లిన నేపథ్యంలో రోడ్ జర్నీ మూవీస్ చాలా ఎక్కువగా వచ్చాయి. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రోడ్ జర్నీ నేపథ్యంలో తీసిన మూవీ కావడం ఫలిమీ స్పెషాలిటీ. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కష్టాలు, వారి పరిస్థితులు నవ్వులు పూయిస్తాయి. ఫలిమీ ప్రారంభంలో పాత్రల పరిచయానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో పెళ్లి చూపుల నుంచి కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. నిశ్చితార్థంలో గొడవ తర్వాత హీరో ఇంట్లో సన్నివేశం బాగా నవ్విస్తుంది.

malayalam movie released on ott recently

కాశీ ప్రయాణం కూడా తొలుత నవ్వులు పూయిస్తుంది. అయితే… ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్ది భారం నడుస్తూ ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య ఎపిసోడ్ చాలా సింపుల్‌గా ముగించారు. ఫలిమీ కథ-కథనాలు-సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. సిట్యువేషనల్ కామెడీ నవ్విస్తుంది. అయితే కథలో అసలు విషయాన్ని చాలా తేలికగా తేల్చేశారు. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. తండ్రి కొడుకులు ఎందుకు మాట్లాడుకోరు? కాశీలో ఆ ఇద్దరు మాట్లాడుకోవాల్సిన వచ్చినప్పుడు ఏం జరిగింది? వంటి అంశాలను బాగా ఆవిష్కరించే స్కోప్ ఉన్న కూడా సరిగ్గా ఆవిష్కరించలేదు.

malayalam movie released on ott recently

తాతయ్య, పక్కింటి తాతయ్య మధ్య సన్నివేశాలు బాగా తీశారు. పాటలు కథలో భాగంగా వచ్చాయి. డబ్బింగ్ సాంగ్స్ కనుక గుర్తు ఉండవు. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టు ఉంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ పర్వాలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలకు బసిల్ జోసెఫ్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. చదువు సంధ్యలు వంటబట్టని, మంచి ఉద్యోగం లేని, పెళ్లి కాని యువకుడిగా అతనిలో ఫ్రస్ట్రేషన్ ను చక్కగా చూపించారు. న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు. ఈ సినిమాకి అతని నటనే ప్రధాన బలం.హీరో తమ్ముడిగా సందీప్ ప్రదీప్ మంచి నటన కనబరిచారు.

malayalam movie released on ott recently

ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్, కోపం ప్రదర్శించే సన్నివేశాల్లో అతని పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. తాతయ్యగా నటించిన మీనరాజ్ చక్కగా నటించారు. జగదీశ్, మంజూ పిళ్ళై తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఫైనల్ గా ఒక డిఫరెంట్ మూవీ ని చూడాలనుకునే వారు ఈ సినిమా పైన ఒక లుక్ చేయవచ్చు. కుటుంబంలో వచ్చే కామెడీ సీన్స్, గొడవలు, ఎమోషన్స్, జర్నీ సీన్స్ ఆకట్టుకుంటాయి. సహజత్వంతో ఉన్న మిడిల్ క్లాస్ పాత్రలకు బాగా కనెక్ట్ అవుతారు


End of Article

You may also like