ఎవరు ఈ ధీరేన్ గంగూలీ..? ఈయన తెలంగాణ పితామహుడు ఎలా అయ్యారు..?

ఎవరు ఈ ధీరేన్ గంగూలీ..? ఈయన తెలంగాణ పితామహుడు ఎలా అయ్యారు..?

by Mounika Singaluri

Ads

హైదరాబాద్ అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అడ్డాగా మారింది.సినిమాల నిర్మాణం అంత హైదరాబాద్ మూలంగానే జరుగుతుంది.అయితే గతంలో నిజాం చొరవ వల్ల సినిమాల నిర్మాణ ఇక్కడ జరిగింది. ఇందుకు సినిమా టెక్నీషియన్లు, వ్యాపారులు కృషిచేశారు. కానీ వారు స్థానికేతరులు కావడం వల్ల ఇక్కడ ఎంతో కాలం నిలవలేకపోయారు.

Video Advertisement

అయితే హైదరాబాదులో నిజాం సినిమాలతో సాంస్కృతికపరమైన ముందడుగు వేయాలనుకున్నారు.తమకున్న ఆధునిక ఆలోచనలు, బ్రిటిష్‌ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యం జోడించి సినిమాలతో తన స్థాయిని పెంచుకోవాలనుకున్నారు. అయితే ధీరేన్‌ గంగూలీ దృష్టిలో కలకత్తాలో కన్నా హైదరాబాదులో మూకీల నిర్మాణానికి అనుకూలమైన వనరులున్నా, ఇక్కడి రాజకీయ సామాజిక పరిస్థితులు వల్ల సినిమా రంగాన్ని ముందుకు సాగనివ్వలేదు.

ధీరేన్‌ గంగూలీ హైదరాబాదు స్టేట్‌లో నటునిగా, సినీ పరిశ్రమ వ్యవస్థాపకునిగా, మేకప్‌మెన్‌, సినీ ఎగ్జిబిటర్‌, పంపిణీదారునిగా బహు ముఖంగా తన పాత్ర పోషించారు. వీటితోపాటు స్త్రీలను సినిమాలో చూపించటానికి ఒప్పించటంలో ఆయన కృషి ఎంతైనా ఉంది. తన సినిమాలకు సోదరుని ఆర్థిక సహాయం తీసుకోవడమేగాక, తన భార్యను మూకీలలో నటింపజేశారు. ధీరేన్‌ గంగూలీ హైదరాబాదులో ఉన్నది సుమారు రెండేళ్ళు మాత్రమే. కానీ ఆయన తెలంగాణలో మూకీ సినిమాల నిర్మాణానికి ఆద్యుడుగా నిలిచాడు. అలా విధంగా తెలంగాణ సినిమా పితామహుడైనాడు. సినిమాలు తీసింది తెలంగాణ గడ్డమీద కనుక అతడిని తెలంగాణ సినిమాకు పితామహునిగా కీర్తించడంలో ఎలాంటి తప్పులేదు. పైగా తన జాతికి ఎవరు సేవచేసినా తలకెత్తుకునే తత్వం తెలంగాణది.


End of Article

You may also like