యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన్న చిత్రం సలార్. ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున విడుదల ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు యాక్షన్ ట్రైలర్ ని విడుదల చేస్తామని మూవీ టైం ప్రకటించింది. అయితే ఈరోజు ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించిన తర్వాత మళ్లీ రిలీజ్ టైం ని మార్చేశారు. తర్వాత ఆ టైం కి కూడా రావడం లేదంటూ ప్రకటించి ఫ్యాన్స్ ని పరీక్ష పెట్టారు.

అయితే ఉన్నట్టు ఉండి యాక్షన్ ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసింది. ఈ ట్రైలర్ మొత్తాన్ని ప్రభాస్ ఎలివేషన్స్ తోటి ఫైట్ సీన్లతోటి నింపేశారు. ఈ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అందరు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రైలర్ లో చూపించింది కేవలం 3 ఫైట్లు సీన్లలో బిట్లు మాత్రమే అంటునారు. సినిమాలో ఉండే ఐదు ఫైట్ సీన్లు ఎవరి అంచనాలకి అందకుండా ఉంటాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. లోపల ఇంకా దాచం చూడాల్సింది చాలా ఉంది అంటూ ఫ్యాన్స్ ని ఊరిస్తున్నారు. డిసెంబర్ 22 తారీఖున సినిమా చూశాక థియేటర్లు తగలబడిపోతాయేమో అంటూ పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.


కల్యాణి ప్రియదర్శన్ తెలుగు మూవీ ‘హలో’ తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ చిత్రానికి గాను ఆమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ అవార్డును అందుకుంది. ఆ తరువాత చిత్రాలహరి, రణరంగం సినిమాలతో అలరించారు. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ‘శేషమ్ మైక్ – ఇల్ ఫాతిమా’ మలయాళ మూవీ నవంబర్ 17న విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 16 నుండి ‘నెట్ ఫ్లిక్స్’లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మూవీ కథ విషయానికి వస్తే, ఫాతిమా (కళ్యాణి ప్రియదర్శన్) చిన్నతనం నుండి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మునీర్ (సుధేశ్), తల్లి (ప్రియా శ్రీజిత్), అన్నయ్య ఆసిఫ్ (అనీష్) ఉంటారు. తండ్రి అన్నయ్య మెకానిక్ షెడ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. మునీర్ కుటుంబ పరువు ముఖ్యంగా భావిస్తూ ఉంటాడు. ఫాతిమాకు ఆసిఫ్ సపోర్ట్ చేస్తుంటాడు. ఫుట్‌బాల్ చూస్తూ, అర్థం చేసుకుంటూ పెరిగిన ఫాతిమా ఎక్కడున్నా కబుర్లు చెప్పే అలవాటు ఉంటుంది.
కాలేజ్ లో చదివేటప్పుడు ఫుట్ బాల్ టోర్నమెంట్స్ కి ఫాతిమా కామెంటేటర్ గా చేయడంతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆమె ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా వృత్తిని కొనసాగించాలని డిసైడ్ అవుతుంది. కానీ ఫాతిమా జనాల్లోకి వెళ్లడం వల్ల వారి కుల పెద్దల నుండి విమర్శలు వస్తాయి. దాంతో మునీర్ ఫాతిమాకి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ఫాతిమా మాత్రం అనుకున్నది సాధించిన తరువాతే పెళ్లి చేసుకుంటానని, కొచ్చికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఫాతిమా అనుకున్నది సాధిస్తుందా? అనేది మిగిలిన కథ.












మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ చిత్రం బ్రో డాడీ. ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాని రాజకీయ నేపథ్యంలో తీసిన, పృథ్వీరాజ్ ఈ మూవీని కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాడు. ఈ మూవీ 2022 లో జనవరి 26న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, జాన్ కట్టాడి (మోహన్‌లాల్), అన్నమ్మ(మీనా) ల కుమారుడు యేషూ (పృథ్వీరాజ్ సుకుమారన్). యేషూ బెంగళూర్ లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. అతను కురియన్ (లాలు అలెక్స్), ఎల్సీ కురియన్ (కనిహ) ల కూతురు అన్నా (కళ్యాణి ప్రియదర్శన్)ను ప్రేమిస్తాడు. అన్నా కూడా యేషూని లవ్ చేస్తుంది. జాన్, కురియన్ లు మంచి ఫ్రెండ్స్. వారి భార్యలు తమ పిల్లలకు పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తారు. అయితే అప్పటికే బెంగళూరులో యేషూ, అన్నాలు నాలుగేళ్లుగా సహజీవనం చేస్తుంటారు. ఈ విషయం పెద్దలకు తెలియదు. యేషూ మరియు అన్నా వారి బంధం గురించి తల్లిదండ్రులకు చెప్పాలని ఆలోచిస్తుంటారు.
ఈలోగా అన్నా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దాంతో యేషూ షాక్ అవుతాడు. అదే టైమ్ లో అర్జంట్ గా రమ్మని జాన్ నుండి కాల్ వస్తుంది. వెంటనే బయలు దేరి తండ్రి దగ్గరికి వెల్లున యేషూకు జాన్ అతని తల్లి ప్రెగ్నెంట్ అనే షాకింగ్ వార్తను జాన్, అన్నమ్మలు చెబుతారు. విషయం తెలిసిన యేషూ ఎలా రియాక్ట్ అయ్యాడు? అన్నా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని జాన్, అన్నమ్మలకు ఎలా చెప్పాడు? అది విన్న వారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఈ మలయాళ స్టార్ హీరోలు ఇద్దరు తండ్రీకొడుకులుగా నటించడం ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.


