తెలుగు ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల అంటే అందరికీ పరిచయమే. యాంకర్ సుమ భర్తగా ప్రముఖ నటుడిగా రాజీవ్ కనకాల కి మంచి పేరు ఉంది. అయితే రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ రాజీవ్ కనకాల నటించేవాడు. అయితే ఇటీవల రాజీవ్ కనకాల కి ఎన్టీఆర్ కి మధ్య గొడవలు వచ్చాయి అనే విషయం టాలీవుడ్ లో వినిపించేది.
ఈ విషయం పైన రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల వివరణ ఇచ్చారు. రోషన్ కనకాల హీరోగా బబుల్ గమ్ అనే మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీ డిసెంబర్ 29వ తారీకున విడుదల కానుంది. రోషన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గొడవకు సంబంధించి రోషన్ కనకాలను అడగగా… ఈ వార్తను ఆయన కొట్టి పడేసాడు. ఎన్టీఆర్ కి రాజీవ్ కనకాల మధ్య గొడవ లేదని ఎప్పుడో క్లారిటీ ఇచ్చినా కూడా అది ఇంకా మాట్లాడుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తో రాజీవ్ కనకాలకి ఎప్పటిలాగే స్నేహబంధం కొనసాగుతుందని ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారని చెప్పాడు. ఎన్టీఆర్ ని చూసి డ్యాన్స్ నేర్చుకోమని తన తండ్రి తనకి చెప్తారని, తనకి మంచి నటుడు అవ్వాలని ఉందని తెలిపాడు.