నటుడు జయం రవి హీరోగా 2004లో తెరకెక్కిన చిత్రం ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్ గా నటించారు. జయం రవికి తల్లిగా నదియా కనిపించారు. అయితే ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2004లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి రీమేక్ గా దీన్ని అక్కడ రూపొందించారు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం 2003 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం.

తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి దర్శకుడు మోహన్ రాజా సనాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ లో సమాచారం.దీనికి సంబంధించి కథ కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఇందులో నటి నదియా పాత్ర కూడా ఉంటుందని సమాచారం.అయితే ఆమెనే ఎంపిక చేస్తారా? అదే విధంగా హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడు హీరోయిన్ గా నటించిన ఆసిన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.మోహన్ రాజా ప్రస్తుతం జయం రవి హీరోగా తనీ ఒరువన్ చిత్రానికి సిక్వల్ గా తనీ ఒరువన్ -2 తర్కెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఎం.కుమారన్ చిత్రాన్ని ప్రారంభించినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఎం.కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి తెలుగు సినిమా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయికి రీమేక్ అయినప్పటికీ తమిళ్ అభిమానులను ఆకట్టుకునేలా మోహన్ రాజా అనేక మార్పులు చేశారు. ఈ చిత్రం తమిళనాడులో పెద్ద హిట్ గా నిలిచింది.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,ఐశ్వర్య, వివేక్, జనకరాజ్, వెన్నిరా ఆడే మూర్తి ముఖ్యపాత్రలు పోషించారు.

అయితే తెలుగులో మాత్రం అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి సీక్వెల్ వస్తుందా అనే విషయం పైన ఎటువంటి సమాచారం లేదు. హీరో రవితేజ కి పూరి జగన్నాథ్ కి డేట్ లు కుదరాలి.ఇద్దరు కలిసి కథ విషయం పైన ఒక అంగీకారానికి వస్తే గాని ఈ విషయం పైన స్పష్టత రాదు.
Also Read:యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు ..ఎక్కడో తెలుసా?

రాజమౌళి మహేష్‌బాబుతో మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో రాబోతుంది. అయితే త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తరువాత ఈ సినిమాను మొదలుపెడతారు. అంటే ఈ సినిమా 2023 చివరలో మొదలు అవుతుందని అనుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా గురించి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.ఈ మూవీ కోసం మహేష్ బాబు లుక్‌లో మార్పులు చేయడం లేదని రాజమౌళి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఇండియానా జోన్స్’ లాంటి మూవీ చేయాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానని, అడ్వంచరస్ కథల్లో మహేష్ కనిపిస్తే బాగుంటుంది. ఎప్పట్నుంచో అలాంటి ఆలోచన ఉందని, అలాంటి మూవీ చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే మహేష్ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచరస్ మూవీగా తీయాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని జక్కన్న భావిస్తున్నారని సమాచారం.



















అతను తన పరిశోధనలో ఆ బృందాన్ని కిడ్నాప్ చేసింది పదేళ్లు క్రితం చనిపోయిన బిగ్ డాడీ (శివరాజ్ కుమార్) అని తెలుసుకుంటాడు. అసలు ఇంతకీ బిగ్ డాడీ ఎవరు? అతను జైల్లో ఉండగానే వామన్ ను ఎందుకు లక్ష్యం చేసుకోవాలనుకుంటాడు? ఆ జైల్లో ఉన్న 1000 కేజీల బంగారం కధ ఏంటి? పితామహా ఏజెన్సీలో ఉన్న ఘోస్ట్ కు బిగ్ డాడీ కి సంబంధం ఏంటి? వీరిద్దరూ ఒకటేనా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…!ఇది ఒక రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా…! ఎలివేషన్ లు, మాస్ ఎలిమెంట్స్ ను నమ్ముకుని చేసిన సినిమా కాకపోతే లాస్ట్ లో స్పై టచ్ ఇచ్చి ఆసక్తి రేపించారు.

