ఇండియన్ సినిమాలో రకరకాల జోనర్ల సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సీనియర్ హీరోలు అందరూ కూడా తమ పంథా మార్చేశారు. ఇప్పుడు అందరూ కూడా వయసుకు తగ్గ పాత్రలు ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాలో తాత క్యారెక్టర్ చేసాడు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కూడా అదే తరహా పాత్రను చేశాడు. కానీ రజిని, కమల్ హాసన్ వయసు ఉన్న తెలుగు హీరోలు మాత్రం ఇంకా కుర్ర హీరోలు లాగ ఫీల్ అవుతున్నారు.
వయసుకు తగ్గ పాత్రలు చేస్తేనే కదా… ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసేది. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా లియో సినిమాలో ఒక కొడుకుకి, కూతురికి తండ్రిగా నటించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3 సినిమాలో తండ్రి పాత్రలో నటించాడు. బాలీవుడ్, కొలీవుడ్ లో స్టార్ హీరోలకు లేని ఇబ్బంది మన తెలుగు హీరోలకి ఎందుకు వస్తుంది అంటూ తెలుగు ఆడియోస్ కామెంట్ చేస్తున్నారు.

మన తెలుగులో చూసుకుంటే తాజాగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక కూతురుని పెంచే పాత్రలో నటించాడు. తీరా చూస్తే ఆమె అతని సొంత కూతురు కాదు. నాన్న అని పిలిపించుకోకుండా చిచ్చా అంటూ పిలిపించేలా డైరెక్టర్ సినిమాని తీశాడు. బాలకృష్ణ సొంత కూతురుగా చూపిస్తే ఏమి అడ్డం వస్తుందో అర్థం కావడం లేదు. ఇంకా మన హీరోలు రియాల్టీని అర్థం చేసుకోకపోతే చేసేది ఏమీ లేదు.

తండ్రి పాత్ర చేస్తే ఏం అడ్డం వస్తుంది. ఇంక కుర్ర హీరోయిన్ల పక్కన చిందులు వేయడం ఆపేసి హుందాగా మంచి మంచి పాత్రలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. తెలుగులో కూడా కొందరు యంగ్ హీరోలు తండ్రి పాత్రలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అలా చూసుకుంటే నాని ముందు వరుసలో ఉంటాడు. నాని తాజా చిత్రం హాయ్ నాన్న లో ఒక కూతురికి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. మన యంగ్ హీరోలను చూసైనా సరే మన సీనియర్ హీరోలు మారాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read:నిన్నటి నుండి ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు..! ఈమె ఎవరంటే..




కానీ అనుకోకుండా నటనలోకి అడుగుపెట్టడంతో సంగీతం పైన దృష్టి పెట్టడానికి సమయం దొరకడం లేదు. రిషబ్ శెట్టి నటించిన గరుడ గమన వృషభ వాహన సినిమాలో చైత్ర మంచి పాట కూడా పడింది. ఆమె పాడిన సోజుగాడ సోజు మల్లిగే పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకి కన్నడ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సైమా అవార్డు కూడా అందుకుంది. తాజాగా సప్త సాగరాలు దాటి సినిమాతో కన్నడ ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా బాగా ఫేమస్ అయింది. ఆమె చేసిన పాత్ర చాలా రోజులు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. చైత్ర కి తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.





శింబుతో లవ్ అఫైర్ బ్రేకప్ అనగానే మనకి మొదటి గుర్తు వచ్చేది లేడీస్ సూపర్ స్టార్ నయనతార.















