
పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతమైన ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్న ఓజి షూటింగ్ ప్రస్తుతం చిన్న బ్రేక్‌లో ఉంది. దర్శకుడు సుజిత్ మిగిలిన పనుల్నీ చకచకా పూర్తి చేస్తున్నాడు. హీరో డేట్లు ఇవ్వడం ఆలస్యం. వీలైనంత ఎక్కువ భాగం తీసేసి రిస్క్ లేకుండా చూసుకుంటున్నాడు. ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా డీవీవీ సంస్థ శుభాకాంక్షలు చెబుతూ ఓజిని ఈ ఏడాది పేల్చి పారేద్దాం అంటూ ట్వీట్ చేసింది.

సాధారణంగా విడుదలను ఉద్దేశించి ఇలాంటి మాటలు వాడతారు. అంటే డిసెంబర్లో ఓజి రావడం పక్కా ఏమోనని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. కానీ ఏ కోణంలో చూసినా ఇది సాధ్యమయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. ఎందుకంటే ఇంకా షూట్ చాలా బాలన్స్ ఉంది. డిసెంబర్ మొదటి వారంలో హాయ్ నాన్న, గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలేంటైన్, ఎక్స్ట్రార్డినరి మ్యాన్లు ఉన్నాయి.

వీటికి థియేటర్ల సర్దుబాటు చేయడమే పెద్ద తలనొప్పి. ఒకవేళ కనుక ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే వీళ్లు తప్పుకోవడం ఖాయం. కానీ ప్యాన్ ఇండియి రేంజ్లో ఇంత బడ్జ్టెట్ పెడుతున్నప్పుడు హడావిడిగా రిలీజ్ ప్లాన్ చేసుకోరు. పైగా అంచనాలు విపరీతంగా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్‌ను చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. సో లేనిపోని ఆశలు పెట్టుకోవడం కన్నా ఓజి వచ్చే ఏడాదే విడుదలవుతందని ప్రిపేర్ కావడం అవసరం.

ఏదో ఫ్లోలో పేల్చేద్దాం అన్నారు కానీ ఆచరణలో మాత్రం సులభం కాదు. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ఓజిని దగ్గదలో చూడలేం. ఇన్సైడ్ టాక్ ప్రకారం ముందు డిసెంబర్ అనుకున్న మాట వాస్తవం. అయితే చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత జనసేన కోసం పవన్ ఇంకా ఎక్కువగా రాజకీయ కార్యకలాపాలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రభావం నేరుగా ఏజి, ఉస్తాద్ భగత్ సింగ్‌ల మీద పడింది. ఎన్నికల ముందే ఏదో ఒక సినిమా థియేటర్లలో రావడం పక్కానే. అదేంటనేది తేలాలి.












#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18














“రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఎలా ఉంది?” అని కోరాలో అడుగగా, దానికి
హీరో రవితేజ, చెప్పి మరీ ఫ్లాప్ కొడతాడు. అప్పుడెప్పుడో రాజా ది గ్రేట్ తరువాత గజనీ మహ్మద్ లాగా మన మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. సినిమా లిబర్టీ పేరుతో మనల్ని పోస్ట్ మర్టం చేస్తున్నారు. థియేటర్ నుండి బయటకి రాగానే కప్పుడు కెపచినో తాగితే తప్ప బుర్ర కూల్ అవ్వలేదు. ఓవెన్ లో పెట్టి వేడి చేసినట్లు హీట్ ఎక్కిపోయింది.
కామెడీ నిల్, పోని కథకు కామెడీ అవసరం లేదు అనుకుందాం, డ్రామా ఇంకా నిల్. యాక్షన్ లో కూడా గొప్పగా ఏం లేదు. రోత కూరగాయల నరుకుడు ఫైట్స్ ఏ అన్నీ. రేణు దేశాయి పాత్రకి న్యాయం లేదు. సర్లెండి కథలోకి వెళ్ళకుండా పై మెరుగులు మాత్రమే చెబుతున్నా, చూడాల్సిన సినిమా ఒక్క శాతం కూడా కాదు. చూసిన తరువాత మీ డబ్బులు వాపసు ఇవ్వరు” అంటూ రాసుకొచ్చారు.