రాజకీయాల్లో బిజీ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘వకీల్ సాబ్’ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ బిజీ గా ఉంటున్నారు. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన పవన్ వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే ఆహార్యం లో చాలా సింపుల్ గా కనిపించే పవన్ కళ్యాణ్ దగ్గర పలు ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
#1 బంగ్లా
జూబ్లీ హిల్స్ లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక అధునాతనమైన బంగ్లా ఉంది దాని విలువ 12 కోట్లు.
#2 ఫామ్ హౌస్
ఖాళీగా ఉంటే పవన్ కళ్యాణ్ ఫార్మ్ హౌస్ కే పరిమితమవుతారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేయడం, పశువుల పోషణ చూసుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం. చాలా కాలం క్రితమే పవన్ హైదరాబాద్లో 16 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఇక్కడున్న ఫామ్ లాండ్ ఒక్కో ఎకరం 10 కోట్ల వరకు వుంటుందని చెబుతున్నారు. అంటే 16 ఎకరాల విలువ మొత్తం 160 కోట్లుగా చెబుతున్నారు.
#3 ఫ్లాట్
పవన్ కళ్యాణ్ కి బంజారా హిల్స్ లో ఒక ఫ్లాట్ కూడా ఉంది. దాని విలువ 1 .75 కోట్లు.
#4 మెర్స్ డెజ్ AMG జి 63
పవన్ కళ్యాణ్ వద్ద భారీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. వాటిలో మెర్స్ డెజ్ AMG జి 63 ఒకటి. దాని విలువ 2 .18 కోట్లు
#5 జాగ్వర్ ఎక్స్ జె
పవన్ కళ్యాణ్ దగ్గరున్న మరో అధునాతనమైన కార్ జాగ్వర్ ఎక్స్ జె. దీని విలువ 1 .11 కోట్లు
#6 మెర్స్ డెజ్ బెంజ్ ఆర్ 350
పవర్ స్టార్ దగ్గరున్న మెర్స్ డెజ్ బెంజ్ ఆర్ 350 కాస్ట్ 66 .6 లక్షలు
#7 BMW 520 డి
పవర్ స్టార్ కలెక్షన్స్ లో ఉన్న BMW 520 డి విలువ 60 లక్షలు
#8 ఫోర్డ్ ఎండీవోర్
పవర్ స్టార్ దగ్గరున్న ఫోర్డ్ ఎండీవోర్ కాస్ట్ 33 . 7 లక్షలు
#9 హార్లే-డేవిడ్సన్ హెరిటేజ్ సోఫ్టైల్ క్లాసిక్
పవర్ స్టార్ దగ్గరున్న హార్లే-డేవిడ్సన్ హెరిటేజ్ సోఫ్టైల్ క్లాసిక్ బైక్ విలువ 18 లక్షలు
#10 పనరెయ్ సబ్ మర్సిబుల్ కార్బెన్ టెక్ 47 mm
పవన్ వాడుతున్న ఈ వాచ్ ధర అక్షరాల… రూ. 14.7 లక్షలు