ఒక మూవీని నిర్మించడం అనేది ప్రొడ్యూసర్ కు ఒక యజ్ఞం వంటిది. నిర్మాత తన సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం లేదంటే ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకురావడం వంటివి చేస్తుంటారు. అయితే ఆ మూవీ విజయం సాధించి, మంచి వసూళ్లు వస్తేనే ఇండస్ట్రీలో కొనసాగడం సాధ్యం అవుతుంది. లేదంటే నష్టాలతో నడిబజారున పడుతారు. అలా నష్టాలతో దివాళా తీసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు.
సినీ రంగంలో స్థిరపడాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి వస్తుంది. తాజాగా హీరో రానా దగ్గుబాటి బాహుబలి సినిమాలను నిర్మించడం కోసం ఆర్కా మీడియా డబ్బు విషయంలో ఎలాంటి రిస్కులు చేసిందో వెల్లడించారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీ భారతీయ సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులను ఒక్కసారిగా మార్చివేసింది. సినీ హిస్టరీలో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోయింది.
అయితే ఈ చిత్రాలకు ఊహించని స్థాయిలో ఖర్చు అయ్యింది. ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్స్ 400 కోట్లు అప్పు చేశారని ఇటీవల రానా చెప్పుకొచ్చారు. 3, 4 ఏళ్ల క్రితం చిత్రాలకు డబ్బులు పెట్టాలంటే ప్రొడ్యూసర్ తన ఇంటి నుంచి, లేదా బ్యాంకులలో ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేవారని రానా అన్నారు. గతంలో 24-28 శాతం వడ్డీ కట్టేవాళ్లమని చెప్పారు.
బాహుబలి 1,2 చిత్రాల కోసం 300-400 కోట్లు 24 శాతం వడ్డీకి అప్పుగా తీసుకువచ్చారని రానా అన్నారు. బాహుబలి 1 సమయంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఆ సమయంలో నిర్మాతలు 180 కోట్ల రూపాయలు 24 శాతం వడ్డీకి అప్పు చేశారని చెప్పుకొచ్చారు. బాహుబలి ఆడకపోతే ఆ కండిషన్ ను ఊహించుకోవడం కూడా కష్టమని రానా అన్నారు.
Also Read: “గుంటూరు కారం” వీడియోలో మహేష్ బాబుతో పాటు ఉన్న… మరొక హీరోని గుర్తుపట్టారా..? అస్సలు గమనించలేదే..?

ప్రభాస్, కృతి సనన్ లు సీతారాములుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాని తానాజీ సినిమా దర్శకుడు ఓం రౌత్ దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఓం రౌత్ తో కలిసి టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించాయి. జూన్ 16న రిలీజ్ కాబోతున్నఈ చిత్రం ప్రీ రిలీజ్ డీల్స్ ఇప్పటికే పూర్తి అయ్యాయి. మొత్తం ఐదు భాషలలో ఈ మూవీ పై 550 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ అని సమాచారం.
ఈ మూవీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కి 250 కోట్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ కి వచ్చాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో 185 కోట్లకి రైట్స్ ని తీసుకుంది. హిందీ, ఓవర్సీస్ మరియు ఇతర భాషలలో టి-సిరీస్ భూషణ్ కుమార్ సొంతంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ మాత్రం టి-సిరీస్ అమ్మలేదని తెలుస్తోంది. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏరియా వైజ్ గా ఫ్యాన్సీ రేటుకి లోకల్ డిస్టిబ్యూటర్స్ రైట్స్ ని తీసుకున్నారు.
మొత్తంగా చూసుకుంటే ఆదిపురుష్ పై 550 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 350 కోట్లు భూషణ్ కుమార్ పెట్టారు. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ తోనే 75 శాతం వరకు బడ్జెట్ రికవరీ అయ్యింది. అందువల్ల పాజిటివ్ టాక్ తో ఒక వారం ఆడితే, ప్రొడ్యూసర్స్ కి లాభాలు రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.








ద మోస్ట్ అవేటెడ్ మూవీగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. తాజాగా విడుదల అయిన గ్లింప్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిస్తోంది. బీడీ తాగుతూ, కర్ర తిప్పుతూ, ఊర మాసు లెవెల్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్వాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
రిలీజ్ అయ్యి 24 గంటలు కాకముందే 20 మిలియన్ల వ్యూస్ పొంది, రికార్డుల దిశగా మహేష్ ‘గుంటూరు కారం’ గ్లింప్స్ దూసుకెళుతోంది. అయితే ఈ వీడియోలో మరో నటుడు కూడా ఉన్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరికి ఈ విషయంలో అతడు మూవీలోని ఎమ్ ఎస్ నారాయణ పాపులర్ డైలాగ్ గుర్తుకువస్తోంది.
ఎందుకంటే ఈ వీడియోలో త్రివిక్రమ్ మరో యాక్టర్ ను చూపించి, చూపించనట్టుగా చూపించారని నెటిజెన్లు అంటున్నారు. ఆ నటుడు ఎవరో కాదు జగపతిబాబు. ఒకప్పుడు ఫ్యామిలి హీరోగా అలరించిన, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా రాణిస్తున్నారు. ఈ చిత్రంలో తాను భయంకరమైన విలన్ గా నటిస్తున్నట్టు ఇటీవల ఆయనే ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. ఇక గుంటూరు కారం గ్లింప్స్ జగపతిబాబు ఉన్నారని అంటున్నారు.
ఈ గ్లింప్స్ లో 27 సెకన్ల వద్ద మహేశ్‌తో పాటుగా జగపతిబాబు కనిపించాడు. కానీ అది బ్లర్ ఎఫెక్ట్‌లో ఉంది. మహేష్ సిగరెట్ వెలిగిస్తున్నపుడు, కాలుస్తున్నప్పుడు పక్కనే జగపతిబాబు ఉన్నారు. వీడియోను ఆపి చూస్తే జగపతిబాబు అని తెలుస్తుంది. అలాగే గాల్లోకి జీప్ లేచినపుడు చెవులు మూసుకున్న వ్యక్తి జగపతిబాబు అని తెలుస్తోందని నెటిజెన్లు అంటున్నారు.





సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం గుంటూరుకారం. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో దీని గూర్చి చర్చ జరుగుతోంది. ఈ వీడియోకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మహేష్ చాలా ఏళ్ల తరువాత మాస్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఇలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినందుకు మేకర్స్ కు కృతఙ్ఞతలు చెప్తున్నారు.
అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీకి హీరోగా త్రివిక్రమ్ ముందుగా ఎంచుకుంది మహేష్ బాబుని కాదంట. త్రివిక్రమ్ చేయాలనుకున్నది జూనియర్ ఎన్టీఆర్ తో అంట. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత తారక్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సింది. త్రివిక్రమ్ చెప్పిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని చెప్పడం, త్రివిక్రమ్ మార్పులు చేసినప్పటికీ ఎన్టీఆర్ కి నచ్చలేదంట.
దాంతో ఆ కథకు మహేష్ బాబు తగిన విధంగా అదనంగా కొన్ని సన్నివేశాలను రాసి మహేష్ బాబుతో గుంటూరు కారం గా తీస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. సీనియర్ హీరో జగపతిబాబు విలన్‌గా చేస్తున్నాడు.










