యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆదిపురుష్ మూవీ హిట్టైతే మాత్రమే ఓం రౌత్ కు ఆఫర్లు ఇవ్వాలని పలువురు హీరోలు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ప్రభాస్ ఫాన్స్ కి మరో కొత్త భయం పట్టుకుంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ లేకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ ఈ సినిమా పై ఆశలు పెంచుకున్నారు. ఆదిపురుష్ రిజల్ట్ విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్లు వినిపించకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దర్శకుడు ఓం రౌత్ కి తెలుగుపై ఎక్కువ అవగాహన లేని నేపథ్యంలో.. తెలుగు డబ్బింగ్ ఎలా చేసారు అన్నదానిపై ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

ఆదిపురుష్ మూవీ డబ్బింగ్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అదిపురుష్ మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఓం రౌత్ ఈ సినిమాకు సంబంధించిన ట్వీట్లలో తెలుగులో ఎక్కువగా తప్పులు రాయడంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా వాడుక పదాలు కాకుండా.. కొత్త పదాలు కూర్చారు. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఆందోళనలో పడ్డారు.

మరోవైపు ఆదిపురుష్ దర్శకుని కెరీర్ కూడా ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఆదిపురుష్ మూవీ హిట్టైతే మాత్రమే ఓం రౌత్ కు ఆఫర్లు ఇవ్వాలని పలువురు టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.












నటన ఆపిన చాలా కాలం తర్వాత ఈమధ్య సినిమా ల పట్ల తిరిగి ఆసక్తి చూపుతున్న ఆమె చివరిగా విజేత సినిమాలో తలుక్కుమంది. సినిమాల్లో నటించక పోయినప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి అభిమానులకు ఎప్పుడు ఆమె చేరువుగా ఉంది.













1. సమంత:
2. పూజా హెగ్డే:
3. సాయి పల్లవి:
4. రష్మికా మందన్న:
5. కీర్తి సురేష్:
6. అనుష్క శెట్టి:
7. కాజల్ అగర్వాల్:
8. కృతి శెట్టి :
9. రకుల్ ప్రీత్ సింగ్:
10. ప్రియాంకా మోహన్:
11. రాశి కన్నా:
12. దీపికా పదుకొనే:
దీపికా పదుకొనే ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
అయితే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నప్రసాద్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ కండిషన్ సీరియస్ గా ఉందని సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తెలిపారు. వీలైనంత త్వరగాపంచ్ ప్రసాద్ సర్జరీ చేయాలని, దానికి చాలా డబ్బు ఖర్చవుతుందని, అందు కోసం దాతలు ఎవరైనా సహాయం చేయాలని కోరాడు.
పంచ్ ప్రసాద్ హెల్త్ కండిషన్ ను వివరిస్తూ పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లోనే నూకరాజు ఒక వీడియో విడుదల చేశాడు. “ఎన్నో హాస్పటల్స్ తిరిగామని ప్రసాద్ అన్న హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. 3 ఏళ్ల క్రితమే 2 కిడ్నీలు ఫెయిలయినా, ఆ బాధను అప్పటి నుండి అలాగే భరిస్తున్నాడు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారికి జబ్బులు ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయని, ప్రసాద్ అన్నకు అలానే జరిగింది.
వైద్యులు వీలైనంత త్వరగా ప్రసాద్ అన్నకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని, చేయించకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. ఈ ఆపరేషన్ కు ఖర్చు లక్షల్లో అవుతుంది. చేతులెత్తి ప్రార్ధిస్తున్నా దయ చేసి మీకు వీలైనంత సహాయం చేయండి” అని నూకరాజు అర్థించాడు. పంచ్ ప్రసాద్ ఈ వీడియోలో ముఖానికి ఆక్సిజన్ మాస్కుతో కనిపించాడు.
