రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ప్రస్తుతం ఈ మూవీ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదిపురుష్ జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా విడుదల అవనుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దానిలో భాగంగా నేడు తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్, ఇతర భాషలకు ఆ రాష్ట్రాలలోని లోకల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా టి సిరీస్ సొంతంగా విడుదల చేయాలని అనుకుంటునట్లు తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రోజు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు చినజీయర్ స్వామి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.
Also Read: “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” కథలో నిజం ఎంత..? అసలు ఏం జరిగింది..?










యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16 న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు (జూన్ 6) ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహిస్తోంది. ఈ వేడుక ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈవెంట్ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా వస్తుండడం విశేషం.
ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.










ఒరిస్సాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదం లో 280కి పైగా మరణించగా, 1000కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని భారత దేశ రైల్వే హిస్టరీలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా అనుకుంటున్నారు. నలబై సంవత్సరాల క్రితం హార్‌లోని సహస్ర దగ్గర ఒక ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 500 మంది మరణించారు.
ఇదే ఇప్పటివరకు అత్యంత ఘోరమైన ప్రమాదం. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 280 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాల పై భిన్నామైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొందరు ఈ ప్రమాదం ఇటీవల రిలీజ్ అయిన “విడుదల పార్ట్ 1” సినిమాలో జరిగినట్లే ఉంది అని అంటున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించాడు. ఆయన చిత్రాలు ఎక్కువగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతాయి.
ఈ చిత్రం రిలీజ్ అయినపుడు కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్, కొందరు వ్యక్తులు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని టాక్ వినిపించింది. విడుదల పార్ట్ 1 సినిమా రైలు ప్రమాద సన్నివేశంతో మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో ఇక ట్రైన్ ను బాంబుతో పేల్చే స్తారు. అయితే ప్రమాదం మాత్రం అచ్చం ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం లాగే ఉండడంతో సేమ్ టు సేమ్, ఆ సినిమాలోని సీన్ రిపీట్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.











1997లో ప్రేమించుకుందాం రా సినిమాతో దర్శకుడిగా జయంత్ సి పరాన్జీ, ఆమూవీ హిట్ తో వరుస అవకాశాలు అందుకుని, టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ సినిమాలను చేశారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష హీరోహీరోయిన్లుగా ‘తీన్ మార్’ అనే సినిమాని చేశారు. ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది. ఇక ఆ మూవీ తరువాత జయంత్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జయంత్ ‘తీన్మార్’ ప్లాప్ కావడం పై స్పందించారు. జయంత్ మాట్లాడుతూ ‘ తీన్మార్ సినిమా నాకు ఇప్పటికీ, ప్రెష్ ప్రేమకథగానే అనిపిస్తుంది. ఈ మూవీ ప్లాప్ అవడానికి కారణాలు అయితే చెప్పలేను. కానీ ఈ సినిమా వల్ల కొందరు పవన్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.
అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిన్ త్రిషకు సోనూసూద్‌తో పెళ్లి కావడం, ఆ తర్వాత త్రిష మళ్ళీ పవన్ కల్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు ఆడియెన్స్ కి నచ్చలేదు. పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఈ సినిమాలో చూడలేక పోయారు. ఇదే సినిమాని ఆ సమయంలోని యంగ్ హీరోతో తెరకెక్కించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది కావచ్చు” అని అన్నారు.