కొత్త సంవత్సరం లో మొన్నటివరకు ప్రేక్షకుల ముందుకు మంచి మంచి సినిమాలు వచ్చి బాగా సందడి చేశాయి. సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ ను బద్దలు చేశాయి. ఇక ఫిబ్రవరి మొదటి వారం నుంచే సినిమాల సందడి మొదలవుతోంది. ఈ వారం కూడా మంచి మంచి సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆ సినిమాలు ఏంటో చూద్దాం..
#1 మైఖేల్
సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయ కోడి దర్శకత్వంలోతెరకెక్కుతున్న సినిమా ‘మైఖేల్’. పాన్ ఇండియా చిత్రం గా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, గౌతమ్ మేనన్, దివ్యాంశ కౌశిక్, అనసూయ, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కానుంది.

#2 రైటర్ పద్మభూషణ్
డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఇందులో సుహాస్, టిన శిల్ప రాజ్, ఆశిష్ విద్యార్థి, గౌరీ ప్రియ తదితరులు నటించిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
#3 బుట్టబొమ్మ
కోలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా బుట్టబొమ్మ. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అరకు బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న బుట్టబొమ్మ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.
#4 ప్రేమదేశం
త్రిగున్ , అజయ్ కథుర్వార్, మేఘా ఆకాశ్, మాయ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ప్రేమదేశం. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. మధుబాల కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న సందడి చేయనుంది.
#5 సువర్ణ సుందరి
పూర్ణ, సాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం సువర్ణ సుందరి. సురేంద్ర మాచారపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విజువల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. జయప్రద, ఇంద్ర, రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది.





















తిరు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే క్రమంలో అనూష, రంజనిలను ప్రేమిస్తాడు అయితే వారు అతన్ని ప్రేమించరు. నిరాశలోకి వెళ్ళిన అతన్ని వాళ్ల తాత శోభన స్నేహాన్ని, ప్రేమగా చెప్పడంతో అక్కడ నుండి కథ మలుపు తీసుకుంటుంది.
అయితే ఈ సినిమా అభిమానులకు నచ్చినప్పటికి, సూపర్ హిట్ అయినప్పటికీ మరికొంత మందికి నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కోరాలో ఈ సినిమా గూర్చి చర్చ జరుగగా, ఈ సినిమాలో మూడు ప్రధాన లోపాలను కలిగి ఉన్నట్టుగా
1. నిత్యా మీనన్ (శోభన) తనకు ప్రేమ కలిగిన వెంటనే తెలియజేసి ఉండాలని, అలా అప్పుడే చెప్పకుండా ఇరవై ఏళ్లు ఎందుకు ఎదురుచూసిందని, ధనుష్ (తిరు) తన తాత శోభన గురించి చెప్పేవరకు కూడా శోభన పై అతనికి ఏమీ అనిపించదు.
2. ఎదిగిన మనిషికి ఎదుటివారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియకుండా ఎలా ఉంటాడు. అది కాకుండా అతనికి ఎటువంటి ఫిలింగ్స్ లేకున్నా అతని తాత అతన్ని తప్పుదారి పట్టించాడు. ఇది కూడా అర్దం లేని విషయమే.
3.ఈ సినిమా ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా దిగజార్చిందని, వారు నిజంగా స్నేహితులు అయినప్పటికీ, అసంబద్ధ కారణాలతో వారిని ఒకరినొకరు ప్రేమించేలా చేసింది.
డైరెక్టర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ మంచి స్నేహితుడిగా ఎందుకు ఉండలేడు. ఇది 1980ల కాలం కాదు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా లేదు. మీరు 2022లో ఉన్నారు.ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, మూర్ఖత్వం ఇంజెక్ట్ చేయవద్దు అని అంటున్నారు.