కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగాగా నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘వారసుడు’ (వారిసు). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, పరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానున్న సంక్రాంతికి మూవీ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున్న రిలీజ్ కానుంది. ఈ చిత్రం లో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది.
ఈ సినిమా నుంచి తమిళంలో ఇటీవల రంజితమే అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో ఇప్పటికే 75 మిలియన్ వ్యూస్‌ను సినిమా సంపాదించుకుంది. కాగా ఇపుడు టాలీవుడ్ ప్రేక్షకుల కోసం తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు మేకర్స్. ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. తెలుగు వెర్షన్ కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమైనట్టే తాజా సాంగ్‌తో అర్థమవుతుంది.

అయితే తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ లో విజయ్, రష్మిక ఫాస్ట్ బీట్ కి డాన్స్ లతో దుమ్ము రేపారు. అయితే ఈ సాంగ్ కి డాన్స్ చేస్తున్న సమయం లో రష్మిక కుడి కాలి పట్టీ ఊడిపోయింది. అయినా రష్మిక అలానే డాన్స్ చేసింది. అది చూసుకోకుండా మేకర్స్ సాంగ్ రిలీజ్ చేసారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పట్టీ ఊడిపోయింది కదమ్మా.. చూసుకోవాలిగా.. అంటూ ఈ వీడియో కి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఈ చిత్రం లో ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక రోల్స్ పోషిస్తున్నారు. వారిసు సినిమా పూర్తి చేసిన తర్వాత, దళపతి విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పని చేయనున్నారు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది.

ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం నమోదు చేసింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.














అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేచురల్ స్టార్ నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఒక జర్నలిస్ట్ హిట్ సిరీస్ మూవీస్ లో సమంత లాంటి స్ట్రాంగ్ ఫిమేల్ విలన్ గా చేస్తే బావుంటుండి అని ట్వీట్ చేసాడు. అయితే దీనిని అడవి శేషు రీ ట్వీట్ చేయడమే కాక, ఇది అద్భుతమైన ఆలోచన సమంత ఏమంటావ్ అని సమంతను అడిగాడు. దానికి సమంత సమాధానంగా బాడ్ యాస్ కాప్,ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది అని కామెంట్ పెట్టింది.
అంతేకాక నీ సినిమా హిట్టు అయినందుకు కంగ్రాట్స్, నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూనే ఉంటా అని కామెంట్ చేసింది. అయితే సమంత హిట్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చేసింది. ఇంకో వైపు సమంత అభిమానులు ఆమె ట్వీట్ చేసిందంటే అనారోగ్యంతో లేదని, బాగానే ఉందని సంతోషపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, హిట్ సిరీస్‌ను 8 భాగాలుగా రూపొందించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హిట్ 2 ప్రమోషన్స్ లోనే 3వ పార్ట్ గురించి తెలిపారు. అయితే హిట్ 3 లో నాని హీరోగా, కీలక పాత్రలో అడివి శేష్ నటిస్తాడని తెలిపారు.






