ఖైదీ చేసిన తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే వాంటెడ్ దర్శకుడిగా మారారు లోకేష్ కనకరాజ్. హీరో కార్తీ నటించిన ఈ మూవీ కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది.
ఈ మూవీ విజయవంతమవడంతో విజయ్ లాంటి స్టార్ హీరోతో డైరెక్ట్ చేసే ఆఫర్ కొట్టేశారు లోకేష్ కనకరాజ్. వీరి కాంబినేషన్ లో వచ్చినటువంటి మూవీ “మాస్టర్” మరో కమర్షియల్ హిట్ అందుకుంది.
![]()
దీంతోపాటుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన “విక్రమ్” సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇందులో విజయ్ సేతుపతి, కమలహాసన్, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్లు నటించారు. అలాగే సూర్య కేమియో పాత్రలో కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్లు ఉండడంతో ఈ మూవీపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీని తమిళంతో పాటుగా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్నారు.

అయితే దీనికోసం గత కొద్ది రోజులుగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే లోకేష్ కనకరాజ్ తన తదుపరి సినిమాను టాలీవుడ్ హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసమే కొందరు స్టార్ హీరోలను కలిసి కథలను కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రామ్ చరణ్ ని కూడా కలిసినట్టు సమాచారం.. అయితే తాజాగా లోకేష్ ప్రభాస్ ను కూడా కలిసినట్టు తెలుస్తోంది.

కలవడమే కాదు ఆయన కథ కూడా చెప్పారట. కానీ ప్రభాస్ మాత్రం ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకోలేదని టాక్. లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ సీరియస్ యాక్షన్ అని ప్రభాస్ నో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటి స్టార్ డైరెక్టర్ సినిమాను నో చెప్పి ప్రభాస్ తప్పు చేశాను అని ఫీల్ అయ్యేట్లు ఆయన ఎవరితో సినిమా తీసి సక్సెస్ అవుతారో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.



















ఆయన ఏ సాంగ్ పాడిన అంకితభావంతో పని చేస్తారని పేరు ఉంది. ఆయన గొంతు నుంచి వెలువడిన ఏ పాట అయినా మంచి గుర్తింపు పొందింది. కోట్ల మంది భారతీయుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కే కే. 53 సంవత్సరాల వయసులో మన అందరికీ దూరమయ్యారు. కోల్కతాలోని ఒక కళాశాలలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.


ఒక లైవ్ షో చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కేకే ను పరిశీలించిన వైద్యులు రాత్రి 10.30 గంటలకే ప్రాణం పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం కేకే వయసు 53 సంవత్సరాలు. ఆయన ఒక హిందీలోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో దాదాపు 250 పైగా పాటలు పాడారు.
అలాగే హమ్ దిల్ దే చుకే సనం అనే మూవీ లో కూడా ఆయన పాట పాడారు. ఆయన కోల్కతాలోని వివేకానంద కాలేజీలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సింగర్ హాజరయ్యారు. ఈ విషయాన్ని కూడా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు కేకలు, అరుపులు, గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ లో మనం చూస్తున్నంత సేపు రియల్ ఉన్నికృష్ణన్ చూసినట్టే అనిపిస్తుంది. ఇందులో భయం, బాధ, కోపం ముఖ్యంగా ఉద్వేగం ఇవన్నీ మనకు వచ్చేలా రాసుకున్నారు స్క్రిప్ట్. ఇది శేష్ సినీ జీవితంలో మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఇక మూవీ చూస్తే మాత్రం మీకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. సాంగ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా కలిసివస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ మూవీలో మేజర్ సందీప్ ని ఒక సూపర్ హీరోలా ఫీల్ అవడం ఖాయం. అలా మనం ఫీల్ అయ్యేలా ఈ సినిమాను తీశారు. ఫైనల్ గా మనం ఒక నిజమైన మేజర్ ఎలాంటి కష్టం పడతాడో సినిమా చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఈ మూవీని దర్శకుడు శశి కిరణ్ తిక్క, తెరకెక్కించారు. నిర్మాత మహేష్ బాబు, హీరో అడివి శేష్, హీరోయిన్ శోభితా ధూళిపాళ, మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, రచయిత అడివి శేష్, నటీనటులు ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్, ఈ మూవీ జూన్ 3వ తేదీన థియేటర్లోకి రానుంది.















