రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్న చర్చ బాగా జరిగింది.
అయితే.. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యాక ఊహించిన దానికంటే ఎక్కువగా రికార్డులు బద్దలు కొట్టింది. యావత్ దేశం ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూసి మరిచిపోయింది. జక్కన్న సినిమాలకు వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా zee 5 , నెట్ ఫ్లిక్స్ లలో కూడా ప్రసారం అవుతోంది. దీనితో.. విదేశాల్లో కూడా చాలా మంది ఈ సినిమాలో తమ స్మార్ట్ ఫోన్ లలో చూసేస్తున్నారు. వీరిలో వెస్ట్రన్ పీపుల్ కూడా ఎక్కువమంది ఉన్నారు. అయితే, వీరంతా సినిమా చూసి విచిత్రమైన రివ్యూ లు ఇస్తున్నారు. ఇంటర్నెట్ పుణ్యమాని వారి రివ్యూలు అందరికీ తెలుస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా చూసిన వెస్ట్‌కు చెందిన మూవీ బేర్ జిమ్ అనే ట్విటర్డ్ యూజర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ పై తన ఒపీనియన్ ను ట్వీట్ చేసారు. “ఈ యాక్షన్ డ్రామాని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఆ సాహసోపేతమైన మూవీ ని చూసేవారెవరూ ఇది గే లవ్ స్టోరీ అని నాకెందుకు చెప్పలేదు..?” అని ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పాత్రలు స్వలింగ సంపర్క ఆకర్షణను పంచుకుంటాయని ఆయన తన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.
ఈయన ట్వీట్ కు ఓ ఇండియన్ నెటిజెన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “పాశ్చాత్య ప్రజలు ఎప్పుడూ ఆశ్చర్యపడటం మానేయరు.. ఇద్దరు మగ వ్యక్తులు స్నేహితులైతే.. వారిని స్వలింగ సంపర్కులుగా పేర్కొంటారు..? మై గాడ్ వాట్ ఎ మైండ్ సెట్..” అని ట్వీట్ చేసారు. దీనితో ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంత మంచి సినిమా మీకు ఇలా అర్థమైందా అంటూ ఇండియన్ నెటిజన్స్ సెటైర్లు వేసుకుంటున్నారు. మరో వైపు.. ఈ ట్వీట్ ను డైరెక్టర్ రాజమౌళి చూస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారో అని కొందరు నెటిజన్స్ అనుకుంటున్నారు.
Jaw-dropping action, yes. Adventure, yes. Revenge, yes. But why did none of you tell me #RRRMovie was so heartwarmingly gay??
— Movie Bear Jim (@jjpoutwest) May 22, 2022










#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19



ఎప్పుడు భిన్నమైన పోస్టులు, కొటేషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఆమె తాజాగా “డెడ్ ” అనే పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. ఎందుకు చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి 4వ మూవీ “థోర్ “.. లవ్ మరియు తండర్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
అయితే ముందుగా సమంత డెడ్ అని ఎందుకు రాసింది, మళ్లీ ఎందుకు డిలీట్ చేసింది అనేది ఎవరికీ తెలియలేదు. అయితే కొంతమంది ఆమెకు సినిమా ట్రైలర్ నచ్చలేదని అందుకే డెడ్ అని రాసిందని, కానీ ఇది వైరల్ అవ్వటంతో, సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ చేసినట్లు అవుతుందని సమంత మళ్లీ డిలీట్ చేసింది అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సమంత అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులతో అభిమానులకు షాక్ లు ఇస్తూ, వైరల్ గా మారుతుంది.




