సినిమా ప్రపంచంలో రాణించాలని అందరూ కలలు కంటూ ఉంటారు. అయితే.. ఆ కలలు నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ.. ఈ లోపే కొంతమంది మోసగాళ్ల వలలో పడి నష్టపోతుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా యూట్యూబర్ నానికి చోటు చేసుకుంది.
యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్ గా చూసేవారికి నాని సుపరిచితమే. లోకల్ బాయ్ నాని అనే ఫేమస్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న నాని కూడా ఇలానే మోసపోయారట. స్వతహాగా మత్స్యకారుడు అయిన నాని యూట్యూబ్ లో తన చేపలు పట్టే వీడియోలు, వంటల వీడియోస్ తో ఫేమస్ అయ్యాడు.

ఓరోజు అతనికి రామ్ చరణ్ అసిస్టెంట్లమంటూ ఫోన్ వచ్చింది. మీ వీడియోస్ చూసి రామ్ చరణ్ ఫిదా అయ్యారు. ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అంటూ ఫోన్ లో చెప్పారు. నీకు సీ ఫుడ్ లిస్ట్ ఇస్తామని, ఆ ఫుడ్ తీసుకుని వచ్చేయాలని.. సీ ఫుడ్ అంటే రామ్ చరణ్ కి పిచ్చి అని కల్లబొల్లి మాటలు చెప్పారు. నిజమే అనుకున్న నాని వారు చెప్పిన ఫుడ్ తీసుకుని వెళితే అక్కడ లోపలకు కూడా రానివ్వలేదు. చివరకు ఏదోకటి చెప్పి లోపలకి వెళ్తే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసారు. రామ్ చరణ్ గురించి అడిగితే.. లేరు అని బయటకి వెళ్లారు అని చెప్పుకొచ్చారు.

దీనితో ఫ్రస్ట్రేట్ అయిన నాని ఈ విషయాలు వీడియో తీసి యు ట్యూబ్ లో చెప్పుకొచ్చారు. తాజాగా దీనిపై హీరోయిన్ రేఖా భోజ్ స్పందించారు. ఈమె ‘దామిని విల్లా’, ‘రంగేలా’, ‘కళ్యాణ తస్మై నమహ:’ వంటి సినిమాలలో నటించింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో వైజాగ్ లోనే సొంతంగా స్టూడియో నిర్మించుకుని.. కవర్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అవుతోంది. ఆమె కూడా గతంలో ఇలానే తనను ప్రభాస్ పిలిచారని, నోవాటెల్ హోటల్ లో ఉన్నారని.. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అని లైవ్ లో చెప్పడంతో.. నిన్ను కలవాలని ప్రభాస్ అన్నారని చెప్పుకొచ్చారు.
అయితే అవి అన్నీ విన్నాక దొబ్బేయమని చెప్పడంతో వారు తన కాల్ ను బ్లాక్ చేసారని చెప్పుకొచ్చింది. ఎందుకంటే అంతకు రెండు రోజుల క్రితమే తమ టీం వారు ప్రభాస్ శ్రీను గారిని కలిస్తే.. ప్రభాస్ యుఎస్ లో ఉన్నట్లు, ఆరు నెలల వరకు రారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటివి నమ్ముతూ పోతే.. ఎలాంటి మోసాలు జరుగుతాయో అని ఆమె అలెర్ట్ చేసారు.
watch video:










నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున మాత్రం స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున భార్య అమల కూడా మొదట్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై పోయింది. అమల నాగార్జున కు రెండవ భార్య.
ఆయన అంతకు ముందే లక్ష్మీ దగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నాగచైతన్య పుట్టారు.. తర్వాత నాగార్జున అమల ని పెళ్లి చేసుకుంటే అఖిల్ పుట్టాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తో పాటుగా అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ అఖిల్,నాగచైతన్య స్టార్ హీరో పేరు సంపాదించుకోలేక పోతున్నారు. నాగ చైతన్య దానికి దగ్గరలో ఉన్నా ఇంకా సమయం పట్టేలా ఉంది.
ఈ క్రమంలో నాగచైతన్య గురించి అమల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గరే పెరిగారని, అప్పుడప్పుడు తండ్రి వద్దకు వచ్చి సమయాన్ని గడిపే వాడని ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య సెలవుల్లో మాత్రమే హైదరాబాద్ కి వచ్చే వాడిని, తను నాగచైతన్యని పెంచలేదని. అతను మొత్తం చెన్నైలో పెరిగాడని చెప్పుకొచ్చింది.
వాళ్ళ అమ్మ చైతన్యను చాలా పద్ధతిగా పెంచిందని, రెండు మూడు నెలలకు ఒకసారి చైతన్య హైదరాబాద్ వచ్చి తన తండ్రితో గడిపేవాడిని ముచ్చటించింది. చైతన్య వచ్చినప్పుడు అఖిల్ తన వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగే వాడని, చైతన్య ఇక్కడికి వస్తే అఖిల్ నన్ను కూడా మర్చి పోయేవాడని ఇద్దరు కలిసి సరదాగా ఆడుకొనే వారని తెలియజేసింది. వీరిద్దరిలో అఖిల్ బాగా అల్లరి చేసే వాడని, చైతన్య మాత్రం సైలెంట్ గా ఉండేవారని తెలియజేసింది అమల.
కానీ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్ర రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది శ్రీ రెడ్డి. ఆమె తాజాగా మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఎప్పుడూ బోల్డ్ గా, గ్లామర్ గా కనిపించే శ్రీరెడ్డి, ప్రస్తుతం చీరకట్టుతో షాక్ ఇచ్చింది.
చీరకట్టు అంటే మామూలు చీరకట్టు కాదండోయ్ పెళ్లి కూతురు గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లి కూతుర్లు ఎంతో అందంగా ముస్తాబు అవుతారు. అందుకే నేను కూడా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వాలని అనుకున్నా అంటోంది శ్రీరెడ్డి.








