మెగా డాటర్ శ్రీజకి సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. దానికి కారణం ఆమె ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో భర్త పేరును తొలగించడమే. ఇప్పటివరకు శ్రీజ కళ్యాణ్ అని ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో పేరు పెట్టుకున్న ఆమె..ఇప్పుడు శ్రీజగా మార్చుకున్నారు. నిజానికి పెళ్లి తర్వాత శ్రీజ కళ్యాణ్ గా ప్రొఫైల్ పేరు మార్చుకున్నారు.
కానీ ఇప్పుడు భర్త కళ్యాణ్ పేరు తొలగించడానికి గల కారణాలు ఏంటా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నెలకొంది. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన “సూపర్ మచ్చి” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దీనికి గల కారణం ఏంటో తెలియాలి అంటే వేచి చూడాలి.
సాధారణంగా ఏదైనా మెగా హీరో సినిమా అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఒకళ్ళు ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా అంతకుముందు కళ్యాణ్ దేవ్ నటించిన సినిమాలని కూడా ప్రమోట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మెగా అల్లుడు సినిమా విడుదల ఉంటే మాత్రం ఒక్కళ్ళు కూడా ప్రమోట్ చేయలేదు. దాంతో అనుమానాలు ఇంకా పెరిగాయి. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదల అయ్యింది. కానీ సినిమాకి సంబంధించి ఎవరు ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.