బిగ్ బాస్ అంటేనే మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. మరీ ముఖ్యంగా సండే అంటే ఫన్ డేనే. పైగా ఈ ఆదివారం నాడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రెటీస్ వచ్చి అలరించారు. ఈ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లోహీరో విజయ్ దేవరకొండ వచ్చాడు. అలానే ఆనంద్ కూడా విజయ్ దేవరకొండ తో పాటుగా హౌస్ మేట్స్ ని అలరించాడు.
అదే విధంగా శ్రియ, అవికాగోర్, సుమ కూడా బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఎంతగానో హౌస్ మేట్స్ ని ఎంటర్టైన్ చేసారు. ఇది ఇలా ఉంటే టీమ్స్ వారీగా క్విజ్ ఆడడం జరిగింది. దానిలో భాగంగా నాగార్జున కొన్ని ప్రశ్నలు అడిగారు. పౌరాణిక చిత్రాల పేర్లు చెప్పడం చెప్పమని నాగార్జున అడిగితే… దానికి పింకీ మహాభారతం, రామాయణం, కృష్ణార్జున యుద్ధం, అర్జున్ రెడ్డి అని ప్రియాంక జవాబు చెప్పింది. ఇది విన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఆ… అయిపోయావు నువ్వు ఎలిమినేటెడ్ అంటూ ప్రియాంకని విజయ్ దేవరకొండ ఒక ఆట ఆడుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే సింగర్ కల్పన కూడా వచ్చారు. పేరడీ పాటలతో అదరగొట్టేసారు. రేసుగుర్రం లోని స్వీటీ పేరడీ పాడి గాయని కల్పన షణ్ముఖ్ ని ఆడుకుంది. అలానే అరియానా, సోహెల్ కూడా వచ్చి చిన్న చిన్న పోటీలని పెట్టారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సందర్భంగా వీళ్ళు వచ్చి ఎంతగానో ఎంటర్టైన్ చేసారు.