సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు. అలాగే సీనియర్ నటుడు నరేష్ గారు ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి పలాస సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ కుమార్ దర్శకత్వం వహించారు, ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్,టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో నటించిన ఆనంది మన తెలుగు అమ్మాయి.
వరంగల్ కి చెందిన ఆనంది ఆట ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ఆనంది అసలు పేరు రక్షిత. 2012 లో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో మొదటిసారిగా బిగ్ స్క్రీన్ పై కనిపించారు. తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించారు. ఆ తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో, వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. తర్వాత ఎన్నో తమిళ్ సినిమాల్లో నటించారు.
జనవరి 7వ తేదీ 2021 లో వరంగల్ లో సోక్రటీస్ తో ఆనంది వివాహం జరిగింది. శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషనల్ ఈవెంట్ కి ఆనంది హాజరు కాలేదు. దీనికి కారణం ఏంటి అనేది సినిమా బృందం కూడా ఏ ఒక్క ఈవెంట్ లో చెప్పలేదు. కానీ ఆనంది ప్రమోషన్స్ కి హాజరు అవ్వకపోవడానికి కారణం ఇప్పుడు బయటికి వచ్చింది. సమయం కథనం ప్రకారం, ఆనంది గర్భవతిగా ఉన్నారు. ప్రస్తుతం ఆనంది ఆరు నెలల ప్రెగ్నెంట్ అవ్వడంతో ప్రమోషన్స్ కి రాలేదట. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది.










#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20




అయితే, నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. ఇందులో హైపర్ ఆదితో పాటు సుడిగాలి సుధీర్ కూడా స్కిట్ లో చేస్తున్నారు. స్కిట్ లో భాగంగా రోజా ని సుధీర్, తనకి రష్మీ కి మధ్య చాలా ఏళ్ళ నుండి నడుస్తోంది కదా? వాళ్ళిద్దరినీ కలపడానికి ఏదైనా ప్రయత్నం చేయమని అడిగారు. అందుకు రోజా, “నక్కిలీసు గొలుసు నెక్ కి ఉండాలి. కుక్క గొలుసు కుక్కకి ఉండాలి” అని అన్నారు. అందుకు సుధీర్, “అంటే ఇప్పుడు నేను కుక్క గొలుసు అని మీ అర్థమా?” అని అడుగుతారు. అందుకు రోజా, “చాలా బాగా క్యాచ్ చేశావు” అని అంటారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

