సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తెలుగు సినిమాల్లో “నరసింహ” తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రతి నాయకిగా, సౌందర్య రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో రజనీకాంత్ ను రమ్యకృష్ణ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.
కానీ, రజనీకాంత్ సౌందర్యని ఇష్టపడడం, సౌందర్య కూడా రజనీకాంత్ ను ఇష్టపడడంతో వారిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే.. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తోందన్న విషయం గ్రహించిన రమ్యకృష్ణ సౌందర్యాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది.
ఈ సన్నివేశాల్లోనే.. ఓ చోట రమ్యకృష్ణ తన కాలుతో సౌందర్య ముఖాన్ని తన వైపుకు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచం ఇబ్బందికరమైనదే అయినా సన్నివేశం మాత్రం బాగా పండుతుంది. అయితే.. ఈ సన్నివేశాన్ని షూట్ చేయడానికి ముందు చాలా స్టోరీనే జరిగిందట. అసలు ఈ సన్నివేశాన్ని చేయడానికే రమ్యకృష్ణ ఒప్పుకోలేదట. సౌందర్యకు చాలా పెద్ద మార్కెట్ ఉందని.. తనకి ఇంకా అంత మార్కెట్ లేదని ఇలాంటి సన్నివేశాన్ని చేయలేనని చెప్పేశారట.
ఈ సన్నివేశం చేయడానికి రమ్యకృష్ణ అస్సలు ఒప్పుకోలేదట. కానీ సౌందర్య గారే రమ్యకృష్ణ తో మాట్లాడి ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఒప్పించారట. షూటింగ్ జరిగే టైం లో కూడా రమ్యకృష్ణ చాలా ఇబ్బంది పడ్డారట. అప్పుడు సౌందర్యే రమ్య కృష్ణ కాలుని తన ముఖంపై పెట్టుకుని నటించాలని రమ్యకృష్ణకి సూచించారట. అయితే.. ఈ సన్నివేశం చేయలేక రమ్యకృష్ణ ఏడ్చేశారట. చివరకు ఎన్నో షాట్ ల తరువాత ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట.





కాజల్ అగర్వాల్ నటించిన హారర్ సినిమా కరుంగాపియమ్. ఈ మూవీ కథ విషయనికి వస్తే, కార్తిక (రెజినా) ఒక పాత లైబ్రరీకి వెళుతుంది. వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే బుక్ కనిపిస్తుంది. దాంతో ఆమె ఆ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే ఆమె చదివే క్యారెక్టర్లన్నీ దెయ్యాలుగా కార్తిక ముందుకు వస్తుంటాయి. వాటిలో కాజల్(కార్తిక) ఉంటుంది. ఆమె పగ తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. ఇంతకి కాజల్ ఎలా చనిపోయింది. ఆమె తన పగను ఎలా తీర్చుకుంటుంద? ఇక రెజీనా క్యారెక్టర్ ఏమిటి అనేది మిగతా కథ.
5 కథలతో ఆంథాలజీగా రూపొందిన హారర్ సినిమా ఇది. రెజీనా క్యారెక్టర్ ద్వారా ఒక్కో స్టోరీని డైరెక్టర్ పరిచయం చేశాడు. కార్తిక ఎపిసోడ్స్‌ను సీరియస్ హారర్ స్టోరీగా తీశాడు. మిగిలిన 3 కథల్ని కామెడీ, హారర్ కలిపి ఆకట్టుకునేందుకు ట్రై చేశాడు. రెజీనాకు ఈ 5 కథలకు కనెక్షన్ ఉందని చూపించే ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్‌తోనే మూవీని ఎండ్ చేసి, పార్ట్ -2 ఉందని చూపించాడు.
కాజల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచింది. ఫుచర్ ను ఊహించే శక్తి కల మహిళగా కాజల్ అగర్వాల్ ఆకట్టుకుంది. అరవ కామెడీని భరించడం కొంచెం కష్టమే. హారర్ ట్విస్ట్‌లన్నీ ఇంతకు ముందు చాలా చిత్రాలలో వచ్చినవే. కొన్ని పాత్రలు ఎందుకొస్తున్నాయో తెలియని గందరగోళంలో సినిమాను ఎండ్ చేశారు.
బాహుబలి మూవీ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతియోశక్తి లేదు. జక్కన్న దర్శకత్వ ప్రతిభ, రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్ ల అద్భుతమైన నటన బాహుబలి సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఇండస్ట్రీల రికార్డులన్నిటిని ఈ మూవీ తిరగరాసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేసింది. బాహుబలి మూవీలో విగ్రహం పైకి లేపిన అనంతరం ఇంటర్వెల్ వస్తుంది. అయితే దర్శకుడు రాజమౌళి ముందుగా వేరే సీన్ దగ్గర ఇంటర్వెల్ వేయాలని అనుకున్నారంట.
అది ఏమిటంటే, దేవసేన ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు’ అని చెప్పినప్పుడు శివుడు నడుస్తూ ఉంటే అతడిలో నుండి అమరేంద్ర బాహుబలి రూపం వస్తుంటే ఇంటర్వెల్ రావాలి. ఈ సీన్ కన్నా ముందు శివుడు నిప్పు, గాలి, భూమి, నీరు, ఆకాశం అయిన పంచభూతాలను దాటుకుని మాహిష్మతి రాజ్యంలో అడుగుపెడతాడు. అయితే ఈ సీన్ ను జక్కన్న ఇలా తీయాలని అనుకోలేదట.
మాహిష్మతి రాజ్యంలోకి వచ్చే ముందు శివుడు మంచు కొండల్లో సైనికులతో ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడున్న ఒక సైనికుడు శివుడిని చూసి అమరేంద్ర బాహుబలి అనుకుని, ‘ప్రభూ నన్ను ఏమీ చేయొద్దు’ అంటూ వేడుకుంటాడు. ఆ తరువాత తప్పించుకుని వెళ్ళి, బిజ్జలదేవుడికి బాహుబలి గురించి చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మకుండా ‘బాహుబలి చనిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి మట్టిలో కలిపాం’ అని చెప్పగానే శివుడు మట్టి గోడను పగుల కొట్టుకుని ఇటువైపు రావాలి.
ఆ తరువాత ‘బాహుబలి శరీరాన్ని మంటల్లో కలిపాం’ అని చెప్పగానే శివుడు మంటలను దాటి రావాలి. ఈ విధంగా బిజ్జలదేవుడు ఒక్కో డైలాగ్ చెప్తుంటే ఒక్కో స్టేజ్ ను శివుడు దాటుకుని వచ్చేలా తీయాలని, అక్కడ ఇంటర్వెల్ వేయాలని భావించారంట. అయితే విగ్రహం పైకి ఎత్తిన తరువాత ఇంటర్వెల్ వస్తే బాగుంటుందని, బిజ్జలదేవుడి డైలాగ్స్ తొలగించారు. ఇక శివుడి మాహిష్మతికి వచ్చే సీన్స్ ను ‘నిప్పులే శ్వాసగా’ అనే పాటలా తీశాం’’ అని జక్కన్న ఒక సందర్భంలో వెల్లడించారు.
















కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 2008లో సత్యం అనే తమిళ యాక్షన్ డ్రామా మూవీలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ సహచరుడు ఎ. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకి దర్శకుడిగా మొదటి సినిమా. ఈ మూవీలో విశాల్ తొలి సారిగా పోలీసు క్యారెక్టర్ లో నటించాడు.
లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. అయితే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని ‘సెల్యూట్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు, అయితే ఈ మూవీ తమిళ, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. సెల్యూట్ మూవీ 2008లోఆగస్టు 14న విడుదలైంది.
ఈ చిత్రాన్ని విశాల్ అన్న విక్రమ్ కృష్ణ నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీలోని ఒక యాక్షన్ సీన్ ను ఇన్ స్టా ఎంటర్టైన్మెంట్ జోన్ అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ సీన్ లో విశాల్ కిక్ చేసిన బాల్ రౌడీలందరికి తగిలి, మళ్ళీ విశాల్ చేతిలో రొటేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఎవరో బోయపాటికి బ్రదర్ లాగా ఉన్నాడు అని కామెంట్స్ పెడుతున్నారు.