అక్టోబర్ 22వ తేదీ రానే వచ్చింది. రామరాజు ఫర్ భీమ్ టీజర్ కూడా విడుదలైంది. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత అద్భుతంగా, ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది టీజర్. కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా టీజర్స్ చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగబోతోంది అని అనిపించేలా ఉన్నాయి.

ఈ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా సమయం ఉంది. కానీ అప్పుడే మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. చరిత్ర ప్రకారంగా చూసుకుంటే ఇద్దరి కథల్లో కొన్ని మతపరమైన అంశాలు ఉంటాయి. అవి సినిమాలో చూపిస్తున్నారా? అనే ప్రశ్న అందరిలో మొదలైంది. కానీ ఒక సారి మనం ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడు జరిగిన ప్రెస్ మీట్ గుర్తు చేసుకుంటే, అప్పుడే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు రాజమౌళి.

ఒకరు “కొమరం భీమ్ నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు, సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి రిలీజియస్ అంశాలు ఇందులో ప్రస్తావించబోతున్నారా?” అని రాజమౌళిని అడిగారు. ఈ ప్రశ్నకి రాజమౌళి ” ప్రతి సినిమాకి ఏదో ఒక రకంగా వివాదాలు వస్తూనే ఉంటాయి అని,

అసలు ఫిక్షనల్ స్టోరీ అయిన బాహుబలి విషయంలోనే వివాదాలు వచ్చాయని, అలా వివాదాలు రావడం చాలా సాధారణం అయిపోయింది అని, వివాదాలు వస్తాయి అని భయపడి, మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన స్టోరీ తీయకుండా ఆపకూడదు కదా?” అన్నారు.
అంతే కాకుండా ఇది కూడా ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు. కాబట్టి కొమరం భీమ్ ని ముస్లిం పాత్రలో చూపించడానికి వెనక కారణం కూడా నిజ జీవితానికి సంబంధించినది కాకుండా ఏదైనా ఇమాజినరీ స్టోరీ అయ్యుండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అసలు కొమరం భీమ్ , రామరాజు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో, రాజమౌళి వాళ్ళిద్దరి గొప్పతనాన్ని ఏ విధంగా మనకి స్క్రీన్ పై ప్రెజెంట్ చేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే.
watch video :






















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12






#2
#3
#4
#5
#6
#7
#8
#9

#12



#2 ఈ ఫ్రేమ్స్ లో రామరాజు ఆయుధం, కొమరం భీమ్ ఆయుధం చూపించారు.
#3 ఇందులో రామరాజు, కొమరం భీమ్ పాత్రల ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు.
#4 ఇందులో ఇద్దరి లెగ్ షాట్స్ చూపించారు. అందులో ఇద్దరికీ ఒక కాలు భూమి మీద ఉంటే ఇంకొక కాలు కొంచెం ఎత్తి అడుగు వేస్తున్నట్టు ఉంది.
#5 ఇందులో ఇద్దరి ఐ షాట్ ఉంది. రామ రాజు ఐ షాట్ లో మనుషులు కనిపిస్తుంటే, కొమరం భీమ్ ఐ షాట్ లో రక్తపు చుక్క కనిపిస్తోంది.
#6 ఇందులో కొమరం భీమ్ షాట్ లో నీటి ఉప్పెన ముందు కొమరం భీమ్ నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రామరాజు షాట్ లో రామ రాజు సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టు ఉంది.
#7 కొమరం భీమ్ చేతిలో జల్ జంగల్ జమీన్ (నీళ్లు, అడవి, భూమి) అనే నినాదం రాసి ఉన్న జెండా ఉంది. రామ రాజు చేతిలో బందూక్ (తుపాకీ) ఉంది.
#8 ఇక్కడ కొమరం భీమ్ బ్యాక్ గ్రౌండ్ అడవి ఉంటే, రామ రాజు బ్యాక్ గ్రౌండ్ పొలాలు లాగా ఉన్నాయి. షాట్స్ కూడా ఫోకస్ కొంచెం ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ మీద పడే లాగా తీశారు.
#9 ఇందులో రాజమౌళి నేమ్ కార్డ్, రామ రాజు ఇంట్రడక్షన్ లో నిప్పుతో, కొమరం భీమ్ ఇంట్రడక్షన్ లో నీటితో వచ్చేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ గురించి చెప్పారు