హనుమాన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమాను చూసిన బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ ప్రకారం హనుమాన్ సినిమా బాగుందని, ఫ్యాసినేటింగ్ అంటూ మూడున్నర స్టార్ రేటింగ్ ఇచ్చారు.
సినిమాలో తేజ సజ్జ హీరోగా అదరగొట్టేసారని గూస్ బంప్స్ మూమెంట్స్ మూవీ లో చాలా ఉన్నాయి. వి ఎఫ్ ఎక్స్ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. మొదటి భాగంలో కొన్ని సీన్స్ కొంచెం సాగదీతగా అనిపించినా స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాని అమాంతం పైకి లేపేసాయి.

క్లైమాక్స్ అసాధారణ రీతిలో అద్భుతంగా ముగించారు. హనుమాన్ సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ సాలిడ్ ఎంటర్టైనర్ ని రూపొందించారు హనుమాన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. పురాణాలు ఆధారంగా డ్రామా భావోద్వేగాలు వి ఎఫ్ ఎక్స్ తో అద్భుతంగా తీర్చిదిద్దారు అని చెప్పుకొచ్చారు. అలాగే హనుమాన్ చిత్రాన్ని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు కూడా చూడడం జరిగింది.

వాళ్లు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి హనుమంతు అనే కుర్రాడు హనుమంతుని అనుగ్రహంతో పుడితే అతనికి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అన్నది మెయిన్ కథగా చెప్పుకోవాలి. హనుమాన్ ఫస్టాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ని మించి ఉంటుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఇంకొక ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.

హనుమంతుడు ప్రత్యక్షమైనప్పుడు స్టన్ అయిపోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు తెలియకుండానే చెప్పులు తీసి పక్కన పెట్టి తమ భక్తిని చాటుకుంటారని సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు. పెద్ద సినిమాల మధ్యలో ఈ చిన్న సినిమా నలిగిపోతుందేమో అనే సింపతీ కూడా హనుమాన్ సినిమాకి ప్లస్ అయ్యింది అంటున్నారు. దానికి తోడు సినిమా టీజర్, ట్రైలర్ కూడా అందర్నీ మెస్మరైజ్ చేసి సినిమాకి మరింత హైప్ ని తీసుకువచ్చాయి.







1. ఉప్పెన:
2. వాల్తేరు వీరయ్య:
3. దేవర:
4. తండేల్:
5. ఓజీ: 
2000 సంవత్సరంలో మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ మూవీ ‘అరయన్నంగళ్ వీడు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆ తరువాత పరదేశి సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డ్ అందుకున్నారు. మలయాళంలో సాధించిన విజయంతో ఆమెకు కన్నడ సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి.
ఇప్పటివరకు లక్ష్మి దాదాపు 40 మలయాళ చిత్రాల్లో నటించింది. మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి, జయరామ్ వంటి సూపర్ స్టార్లందరితో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సైరా నరసింహ రెడ్డి మూవీలో కూడా నటించారు. ఆ తరువాత ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, మలయాళ, తమిళ భాషలలో పలు సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో 2014 లో ఇటీవీలో ప్రసారం అయిన శ్రీవేంకటేశ్వర కల్యాణం సీరియల్ లో శ్రీదేవిగా నటించారు. ఆమెకు నటనతో పాటు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అటు అభిమానుల నుండి ఇటు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ట్రైలర్ చూసిన చాలామంది మరో సినిమాతో పోలుస్తున్నారు. కొందరు కీర్తికిరీటాలు అనే నవలతో పోలుస్తున్నారు.
ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారంగా, వసుంధర (రమ్యకృష్ణ), ఆమె పెద్ద కుమారుడు రమణ (మహేశ్‌బాబు)ను చిన్నతనంలోనే విడిచిపెడుతుంది. వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో రమణ అనాథగా పెరుగుతాడు. కొన్నేళ్ల అనంతరం ఊహించని పరిస్థితులలో తల్లి కొడుకులు కలుస్తారు. ఆమెకు ఎదురైన ప్రాబ్లమ్స్ ని రమణ తీరుస్తాడా? ఇద్దరికీ నిజం తెలిసిందా? అనేది కథ. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే 2005లో మలయాళ మూవీ రిలీజ్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా వచ్చిన మూవీ పేరు ‘రాజమాణిక్యం’. హీరో రాజమాణిక్యాన్ని తండ్రి చనిపోవడంతో చిన్నతనంలోనే, తల్లి ముత్తులక్ష్మి విడిచిపెడుతుంది.
బిజినెస్ మెన్ రాజారత్నం పిళ్లైని వివాహం చేసుకుంటుంది. అయితే తల్లిని వెతుకుతూ రాజమాణిక్యం రాజారత్నం ఇంటికి వెళ్తాడు. కానీ ముత్తు లక్ష్మి అతన్ని కొడుకుగా ఒప్పుకోదు. రాజారత్నంకు ఈ నిజం తెలియడంతో రాజమాణిక్యంను ఆదరస్తాడు. కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. 2008 దాకా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. గుంటూరు కారం ట్రైలర్ లో దాదాపు మమ్ముట్టి మూవీ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టోరీనేనా? కాదా అనేది తెలియాలి అంటే జనవరి 12 దాకా వేచి చూడాల్సిందే.

నటుడు, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి లీడ్ రోల్స్ లో నటించిన ’90స్’ వెబ్ సిరీస్ జనవరి 4న ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యింది. మధ్యతరగతి జీవితాల పై తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలలో చక్కగా నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శివాజీ చిన్న కొడుకు ఆదిత్యగా నటించిన బాల నటుడికి మరింత గుర్తింపు లభించింది.
ఆ అబ్బాయి పేరు రోహన్ రాయ్. రోహన్ సీరియల్స్, సినిమాలలో నటిస్తున్నాడు. కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా బిల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ కోసం ఆడిషన్స్ కి తల్లితో పాటుగా వెళ్ళగా ‘చారు కేశ’ అనే పాత్రకు ఎంపిక అయ్యాడు. ఈ పాత్రలో నటించి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత టాలీవుడ్ కూడా అడుగుపెట్టాడు. అలా రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’మూవీలో కనిపించాడు.
రోహన్ రాయ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారాడు. ఇక ’90స్’ వెబ్ సిరీస్ తో డిజిటల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో చదువు ఎక్కని ఆదిత్య క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వంతో కనిపిస్తూ, కామెడీతో నవ్విస్తూ, కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించాడు. రోహన్ పై ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.