అఖండ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 107. ఇంకా టైటిల్ డెసిషన్ పెండింగ్ లో ఉన్న ఈ చిత్రం లో బాలయ్య బాబు ఇంతవరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని మాస గెటప్ లో అభిమానులను అలరించనున్నరు. ఇప్పటికే విడుదలైన టీజర్స్,ఈ చిత్రం లో ని బాలకృష్ణ లుక్స్ ఈ చిత్రం పై ఎక్స్పెక్టేషన్స్ ను అమాంతం పెంచాయి.
కాగా ఈ సినిమా షూటింగ్ లు, ఇంటర్వ్యూ ల క్రమం లో బాలకృష్ణ కు సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ లతో చాలా బిజీ గా ఉన్న బాలకృష్ణ కు చేదోడు వాదోడుగా ఉంటూ మేనేజర్ గా తండ్రి కి సంబందించి బాధ్యతలు నిర్వహించేందుకు ఆయన చిన్న కుమార్తె తేజస్విని స్వయం గా నడుము బిగించారంట.

బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ప్రక్యత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి గీతం గ్రూప్స్ చైర్మన్ భారత్ ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడు షూటింగ్స్ అంటూ బిజీ గా ఉండే బాలయ్య తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు అని భావించిన తేజస్విని ఆయన మేనేజర్ గా వ్యవహారాలు చూసుకునేందుకు ఇష్టపడిందట.

ఇంతకు ముందు వరకు బాలకృష్ణ సినిమాలకు సంబందించి ఫైనాన్స్ వ్యవహారాలు అనీ ఆయన సతీమణి వసుంధర స్వయంగా చూసుకునేవారట. కాగా తల్లి బాట లోనే ఇప్పుడు తేజస్విని కూడా తండ్రి కాస్ట్యూమ్స్, కాల్ షీట్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇలా అన్ని వ్యవహారాల్ని తనే దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని ఇండస్ట్రీలో టాక్. అంతేకాక పొలిటిషన్ అయిన తండ్రి సినిమాల ప్రభావం ఆయన పొలిటికల్ కెరీర్ మీద ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏకంగా బాలకృష్ణ డైలాగు ల విషయంలో కూడా తేజస్విని ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా పాటిస్తున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో రోజు షూటింగ్ లొకేషన్స్ కి వెళుతున్న తేజస్విని బాలయ్య బాబు చేత ఎప్పటి నుంచో ఉన్న ఆ అలవాటుని మాన్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకు అప్పుడప్పుడు స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నట్టు వినికిడి. అయితే రెగ్యులర్ గా షూటింగ్ సెట్స్ కి వచ్చే ఆయన కుమార్తె తేజస్విని తన ఈ అలవాటు వల్ల ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని బాలయ్య బాబు స్మోకింగ్ మానేసినట్లు వార్త వైరల్ అవుతుంది.. అయితే కూతురే తండ్రి చేత అలవాటు మానిపించిందా లేక కూతురి కోసం తండ్రే అలవాటు వదులుకున్నారా అనేదానిమీద ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనాప్పటికీ కూతుర్లకు తండ్రి పైన తండ్రికి కూతుర్ల పైన ఉన్న పరస్పర ప్రేమ మమకారం బాలయ్య కుటుంబానికి పెద్ద వరం.







సంజయ్ లీలా భన్సాలీ
డైరెక్టర్ అట్లీ
ఏఆర్ మురుగదాస్
కొరటాల శివ
డైరెక్టర్ త్రివిక్రమ్
బోయపాటి శ్రీను
కానీ పూరీ జగన్నాథ్ కి తన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. అప్పట్లో ఒకసారి ‘ఆటో జానీ’ అంటూ వార్తలు వచ్చినా, ఆ తరువాత అది అక్కడే ఆగిపోయింది. మెగాస్టార్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా పూరీ చెప్పిన కథ నచ్చి సినిమా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో, పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పూరీకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పూరీ కెరీర్లో కోలుకోవడం చాలా కష్టం అనే మాటలు ఎక్కువ వినిపించాయి. అయితే, పూరీ జగన్నాథ్ కి ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మామూలే. తన స్కిల్నే నమ్ముకుని పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు.

ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.


