ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోయాయి. హఠాత్తుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా కుప్పకూలి పోతుంటారు. ఏమైందో తెలిసేలోగా మరణించారని అంటారు.
ఇలా మరణించడానికి కారణం గుండెపోటు. అయితే గుండెపోటుకు సంబంధించి కొన్ని లక్షణాలు మాత్రం ముందుగానే కనబడుతూ ఉంటాయి. మరి ఆ లక్షణాలు ఏమిటి అనేది చూద్దాం.
#1. ఎడమ చేతి భాగంలో లేదా ఎడమ చేతిలో నొప్పి:
గుండెపోటు వచ్చే వాళ్ళకి ముందుగా ఎడమచేతి భాగంలో కానీ ఎడమ ఛాతిలో కానీ నొప్పి ఉంటుంది. నొప్పి లేకపోయినా కాస్త అసౌకర్యంగా ఉంటుంది. ఇలా అనిపిస్తే తప్పక డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.
#2. దవడలు, మెడభాగంలో నొప్పి:
కొందరిలో అయితే దవడలు, మెడభాగంలో నొప్పి ఉంటుంది. ఇది కూడా గుండెపోటుకి లక్షణమే అని వైద్యులు అంటున్నారు.
#3. చిన్న చిన్న పనులకు అలసిపోవడం:
ఏదైనా చిన్న పని చేసినా అలసి పోవడం లేదంటే నీరసం రావడం లాంటివి కూడా గుండెపోటు లక్షణాలు.
#4. శ్వాస తీసుకోవడంలో సమస్యలు:
కాస్త ఆయాసంగా అనిపించినా కూడా అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా గుండెపోటు లక్షణాలు. ఈ చిన్న చిన్న లక్షణాలని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ని సంప్రదిస్తే ముందుగా వైద్యం తీసుకోవడం ఉత్తమం.