చాలా మందికి తీపి పదార్ధాలు ఇష్టం ఉండవు. అందులోను బెల్లం తినడానికి ఎక్కువ గా ఇష్టం చూపించరు. నిజానికి బెల్లం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే.. ఇంకెప్పుడు బెల్లాన్ని దూరం పెట్టరు. అందుకే.. పలు పండగలు, పూజలప్పుడు బెల్లం తో కలిపినా నైవేద్యాలు, పిండివంటలు చేయాలనీ చెబుతూ ఉంటారు.
బెల్లం రక్తహీనతను తగ్గిస్తుంది. బెల్లం, వేరుశనగ పప్పు కలిపి తీసుకోవడం వలన శరీరానికి ఎక్కడలేని పోషకాలు లభిస్తాయి. బెల్లం రోజు తీసుకోవడం వలన శరీరం లో అవసరమైన రక్తం ఏర్పడుతుంది. పంచదారకు బదులు, బెల్లం వాడడం వలన మధుమేహానికి దూరం గా ఉండొచ్చు. శరీరం లో పొటాషియం లేమిని తగ్గించి, మూత్రాశయం లో రాళ్లు ఏర్పడకుండా చేయడం లో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. రక్త హీనతతో బాధపడుతున్న వారు రోజు కనీసం యాభై గ్రాముల బెల్లం తింటే.. కొద్దీ రోజుల్లోనే వారు ఈ సమస్య నుంచి దూరమవుతారు.