ఒక మహిళ కారులో ప్రయాణిస్తుండగా టైర్ పంచర్ అవడంతో కారు ఆగిపోయింది. ఆమె వద్ద స్టెఫిని ఉంది, కానీ ఆమెకు దాన్ని మార్చడం రాదు. దాంతో ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తోంది. ఆ సమయంలో సెల్ ఫోన్ కూడా పని చేయడం లేదు. దాంతో ఆమె కారు పక్కనే నిలబడి పోయింది.
చాలా సమయం తర్వాత ఒక వ్యక్తి బైక్ పై అదే దారిలో వెళ్తూ వెనక్కి వచ్చి ఆమె దగ్గర ఆగాడు. అతన్ని చూసి ఆ మహిళా భయపడింది. ఆ వ్యక్తి ఒక మెకానిక్. సాయం చేయడానికి వచ్చాను అని చెప్పడంతో ఎంతో సంతోషపడింది. కారు డిక్కీలో నుండి కావలసిన సామాను తీసుకుని టైర్ మార్చాడు. అయితే తారు రోడ్డు వలన చేతులకు కొన్ని దెబ్బలు తగిలాయి.
ఆమె కొంత డబ్బులు ఇవ్వబోయింది. అయితే అతను డబ్బులు తీసుకోలేదు. మీకు సహాయం చేయాలనిపిస్తే కష్టాల్లో కనిపించిన వారికి నా పేరు చెప్పి సహాయం చేయండి అని చెప్పాడు. కొంత దూరం వెళ్లాక ఆకలి వేయడంతో హోటల్ కి వెళ్ళింది. అక్కడ ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. అయితే ఆమెను చూసి ఎంతో బాధ కలిగింది.
అవసరం ఉంటే కానీ ఆమె పనిచేయదు కదా అని భావించి భోజనం అయ్యాక వెయ్యి రూపాయలు టేబుల్ పై పెట్టి వెళ్ళిపోయింది. మహిళ తిరిగి వచ్చి చూసేసరికి ఒక గ్లాసు కింద నాలుగు వెయ్యి నోట్లు తో పాటుగా ఒక కాగితం ఉంది. నీకు ఎంతో అవసరం ఉంటే కానీ ఈ విధంగా పని చేయవు కదా, నాకు ఒకరు సహాయం చేశారు దాన్ని తలుచుకుంటూ నేను నీకు సాయం చేసి ఆనందిస్తున్నాను. నువ్వు కూడా ఇదే విధంగా సహాయం చేయాలని కోరింది.
ఆ హోటల్ లో పని చేసే మహిళ ఇంటికి వెళ్లి, చేతులకు దెబ్బలు తగిలించుకున్న భర్త తో మన కష్టాలు తీరిపోయాయి, భగవంతుడు మనకు సాయం చేశారు అని చెప్పింది. అంటే మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎప్పటికీ వృధా అవ్వదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సాయం మనకు దక్కుతుంది.
NOTE: All the images used in this article are just for representative purpose only. But not the actual characters