సంసారాన్ని చదరంగంతో పోలుస్తారు…ఎందుకంటే మనం వేసే ఒక్క తప్పుటడుగు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది కాబట్టి. కానీ ప్రస్తుత హడావిడి జీవనశైలి మరియు పరిస్థితుల కారణంగా ఆడవారు తమ పార్టనర్ పట్ల ఆసక్తిని కోల్పోతున్నారు. క్రమంగా కొంతమంది అయితే అసలు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకునే స్థితికి వస్తున్నారు.
పెళ్లి అనేది కేవలం ఇద్దరు మనుషుల మధ్య జరిగే ఒక తపన కాదు.. అది రెండు మనసులు పరస్పరం ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కలిసి నడిస్తే ఏర్పడే ఒక పవిత్ర బంధం. కానీ ప్రైవసీ, జాబ్, ఇండివిజువాలిటీ ఇలాంటి కారణాల వల్ల చాలామంది తమ జీవితంలో లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

ఆడవారు ఎప్పుడు కూడా భర్తలు తమని మానసికంగా అర్థం చేసుకోవాలని, నలుగురిలో గౌరవ ,మర్యాదలతో చూసుకోవాలని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో తమ కుటుంబంలో నెలకొంటున్న కలతల కారణంగా తీవ్రమైన మానసిక వత్తిడికి గురి అయిన సందర్భంలో వారు తమ రిలేషన్షిప్ పై ఇంట్రెస్ట్ పూర్తిగా కోల్పోతారు. మరి ఇలా జరగడానికి వెనక కారణాలు ఏమిటో తెలుసుకుందాం..
నమ్మకం ముఖ్యం…
తమ పార్ట్నర్స్ తమను మోసం చేస్తున్నారు అన్న భావన కలిగినప్పుడు లేదు నమ్మకంగా వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆడవారి మనసు తీవ్ర మనస్థాపానికి గురి అవుతుంది. అలాంటి సందర్భంలో వాళ్లకి తమ పార్ట్నర్ పై పూర్తిగా నమ్మకం పోవడంతో పాటు ఇష్టం కూడా పోతుంది.

కొత్తదనం…
పెళ్లయిన కొంతకాలానికి మగవారికి భార్యలపై ఒక చులకన అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఫ్రెండ్స్ ,జాబ్ అని ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి సమయంలో తమ జీవితంలో కొత్తదనం కోల్పోయిన ఆడవారు క్రమంగా తమ పార్ట్నర్స్ పై ఆసక్తిని కూడా కోల్పోతారు. ఎప్పటికప్పుడు మీ లైఫ్ లో వాళ్లు ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని తెలియపరచడంతో పాటు చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వడం ఒక రిలేషన్ కు ఎంతో ముఖ్యం.

గౌరవం..
భార్య కదా అని ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది పురాణ కాలం కాదు.. నేటితరం యువత తమ భర్త తమకు ప్రేమతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది లేని చోట క్షణం కూడా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి మీ జీవిత భాగస్వామిని నీలో సగంగా భావించి ప్రేమించడంతో పాటు గౌరవించడం కూడా ఎంతో ముఖ్యం.




మరణించిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ, చనిపోయిన తరువాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి కూడా ఇలా చేస్తారని కొందరు చెబుతారు. ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే కోరాలో
“చనిపోయినవారి అంతిమయాత్రలో డబ్బులు చల్లటం అనేది పది, పదిహేను సంవత్సరాల నుంచే చూస్తున్నాం. ఇలా చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు ఏరుకుంటారు. ఈ విధంగా చేస్తే, నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదుగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబసభ్యులకు వుంటుంది. శవ యాత్రలో పూలు, పేలాలు చల్లటం వంటివి చాలా కాలం నుండి వుంది.
పూలు చల్లడం అంటే మరణించిన వారిని గౌరవించడం, దేవునిగా భావించడం కావచ్చు. పేలాలు చల్లడం వల్ల పక్షులు, క్రిమి కీటకాలకు ఆహారం వేసినట్టు భావన. ఇవి మనుషులకు కాదు అనడానికి గుర్తుగా ‘ హాస్యబ్రహ్మ ‘ జంధ్యాల గారు ఓ సినిమాలో ” శవం మీద పేలాలు ఏరుకుని తినే మొహం” అంటూ ఓ తిట్టు చేర్చారు!” అని వెంకట్ రమణ సూరంపూడి తెలిపారు.



















కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాకు చెందిన ఒక మహిళ భర్త నుండి డైవర్స్ తీసుకుంది. అయితే తనకు వస్తున్న భరణంలో కోత పెట్టారని ఆ మహిళా పిటిషన్ వేసింది. ఇటీవల ఈ పిటిషన్ ను కర్ణాటక న్యాయమూర్తి అయిన రాజేంద్ర విచారించారు. ఈ క్రమంలో తీర్పు చెబుతూ, గతంలో జాబ్ చేసిన భార్యలు ఖాళీగా ఇంట్లో ఉండకూడదని, భర్త ఇచ్చే భరణం పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆ మహిళ ఏదైనా జాబ్ చేసుకుంటూ బతకాలని కర్ణాటక హైకోర్టు సూచించింది.
సదరు మహిళ పిటిషన్ ను విచారించిన జడ్జి, మాజీ భర్త ఎందుకు తనకు అదనంగా భరణం ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఆ మహిళ సరైన సమాధానం చెప్పలేదు. భరణం అందుకోవడానికి ఆమె ఉన్న అవసరాలు ఏమిటో చెప్పాలని అడిగింది. వివాహనికి ముందు జాబ్ చేసావు మరి పెళ్లి అయిన తరువాత ఎందుకు జాబ్ చేయలేక పోయావని కోర్టు ప్రశ్నించింది.
కానీ సదరు మహిళ ఏం సమాధానం చెప్పలేకపోయింది. పెళ్ళికి ముందు జాబ్ చేసిన మహిళ వివాహం తర్వాత జాబ్ మానేసి పూర్తిగా భర్త సంపాదన పైనే ఆధారపడింది. భార్య లీగల్ గా బ్రతుకు దెరువు కోసం ఏదైనా ఉద్యోగం చేయాలని, భర్త నుండి కేవలం సపోర్టివ్ మెయింటెనెన్స్ తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది.

