సాధారణంగా తాము ప్రేమించాలి అనుకునే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలి అని, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ అనుకుంటూ ఉంటారు. అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలని ఇష్టపడతారు అనే విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ అబ్బాయిలు అసలు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు, ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలని దూరం పెడతారు అనే విషయం గురించి చాలా తక్కువగా మాట్లాడుతారు. అబ్బాయిలకి కూడా అమ్మాయిల నుండి కావలసిన లక్షణాలు కొన్ని ఉంటాయి. వద్దు అనుకునే లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. అలా అబ్బాయిలకి అమ్మాయిలలో నచ్చని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 రహస్యాలని రహస్యంగా ఉంచని అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పి, అది ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన తర్వాత కూడా కొంత మంది అమ్మాయిలు అది అందరికీ చెప్తూ ఉంటారు. ఒకవేళ అలా వారి వ్యక్తిగత విషయాలు ఏమైనా ఒక అమ్మాయికి చెప్తే, ఆ అమ్మాయి ఆ విషయాన్ని ఇతరులకి చెప్తే అలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు.
#2 ఒకవేళ తను తప్పు చేస్తే అది ఒప్పుకోకుండా అహంకారం చూపించే అమ్మాయిలను కూడా అబ్బాయిలు ఇష్టపడరు. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగితే, లేదా గొడవ జరిగితే, అప్పుడు కాకపోయినా కొంత సమయం తర్వాత తన తప్పు తెలుసుకోవాలి. ప్రతిసారి తప్పు అబ్బాయి వైపు నెట్టేసే అమ్మాయిలని అబ్బాయిలు అసలు దగ్గరికి కూడా రానివ్వరు.
#3 సెల్ ఫోన్ చెక్ చేయడం. ఈ విషయం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండొచ్చు. అయితే, సాధారణంగా కొంత మంది అమ్మాయిలు అబ్బాయిల ఫోన్ లు చెక్ చేస్తూ ఉంటారు. అలా చేసే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు. ఎంత స్నేహంగా ఉన్నా కూడా ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని గౌరవించాలి. ఒకవేళ అలా గౌరవించని వారు ఉంటే వాళ్లని ఇష్టపడరు.
#4 అది చెయ్యి. ఇది చెయ్యి. అది చెయ్యకు. ఇది చెయ్యకు. ఆ అమ్మాయితో మాట్లాడకు. వాళ్లకి దూరంగా ఉండు. ఇలా చెప్పే అమ్మాయిలని అబ్బాయిలు దూరంగానే పెడతారు. ఎవరైనా వాళ్లని ఇబ్బంది పెడుతూ ఉంటే, వాళ్లకి దూరంగా ఉండు అని చెప్తే ఆలోచిస్తారు కానీ, ఎక్కువగా కంట్రోల్ చేయాలి అని ట్రై చేసి, లైఫ్ స్టైల్ తనకి అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు. ప్రేమించడానికి కూడా సుముఖత వ్యక్తం చేయరు.
#5 తాను ఎలా అయినా ఉండొచ్చు. కానీ అబ్బాయి మాత్రం కొన్ని లిమిట్స్ లోనే ఉండాలి అని అనుకునే కొంత మంది అమ్మాయిలు ఉంటారు. ఒకవేళ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే వాళ్ళు దానికి బాధపడతారు. కానీ అబ్బాయి కూడా అలా లిమిట్స్ విధిస్తే బాధపడతారు అని అర్థం చేసుకోరు. అలా ఉన్న అమ్మాయిలను కూడా అబ్బాయిలు ఇష్టపడరు.
అబద్ధాలు చెప్పడం, తనని తాను గొప్పగా అనుకోవడం, పక్కన వాళ్ళని చులకనగా చూడటం, తను ప్రేమించిన వారి మీద అందరి ముందు జోక్ లు వేసే అమ్మాయిలకు కూడా అబ్బాయిలు ఇష్టపడరు. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు అందరికీ అబ్బాయిలు దూరంగా ఉంటారు.