భారతదేశం అంటేనే సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన భారతదేశంలో మనం ఎన్నో ఆచారాలను పాటిస్తాం. కొన్ని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయితే, కొన్ని మాత్రం భారతదేశ వ్యాప్తంగా పాటిస్తాం. అయితే అలా పాటించే ఆచారాలు అన్నిటికీ మనకు అర్థం తెలియాలి అని రూలేమీ లేదు.
మనం భారతదేశంలో ఎక్కువగా పాటించే ఆచారాల్లో గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం ఒకటి. ఇలా కట్టడానికి వెనకాల ఉన్న గల కారణం చాలా మందికి తెలియదు. ఇలా కట్టడం వల్ల దుష్టశక్తులు, ఆత్మలు ఇంట్లోకి రావు అని అంటూ ఉంటారు. కానీ అలా నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడానికి వెనకాల ఒక సైన్స్ కి సంబంధించిన కారణం ఉంది.
పూర్వం చాలా మంది మట్టి ఇళ్ళలో ఉండే వారు. దాంతో పురుగులు, దోమలు వంటివి ఇళ్లల్లోకి ఎక్కువగా వచ్చేవి. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు మస్కిటో కాయిల్స్ లాంటి కెమికల్ పదార్థాలు లేవు. నిమ్మకాయ, మిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. మిరపకాయలో అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మనం నిమ్మకాయని దారానికి గుచ్చినప్పుడు ఆ దారానికి అంటుకొని ఆ ప్రదేశం మొత్తం వ్యాపిస్తుంది. దాంతో దోమలు, ఈగలు లేదా ఇతర కీటకాలు అక్కడికి రాకుండా ఉంటాయి. ఈ కారణంగానే పూర్వంలో నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు దారానికి కలిపి కట్టేవారు. ఇదే పద్ధతిని మనం తరతరాల నుండి ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం.