అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని మంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22 తారీకు అనగా సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొనుంది .ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి ప్రజలందరూ కూడా రామ నామ కీర్తనతో మద్దతు తెలియజేయనున్నారు. దేశంలో ఉన్న అన్ని రామాలయంలోనూ రేపు ప్రత్యేక పూజలు జరగనున్నాయి.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే రేపు అయోధ్య రామ మందిరంతో పాటు మరొక రామాలయం ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఒరిస్సా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్ గ్రామంలో ఈ మందిరాన్ని నిర్మించారు.రేపు విశిష్టమైన రోజు కావడంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు దానికి తగిన ఏర్పాటు చేశారు.
ఈ ఆలయ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. ఫతేఘర్లో సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఓ కొండపైన ఉంది. ఈ ఆలయం ఎత్తు 165 అడుగులు. బౌలమాల అనే ప్రత్యేకమైన రాయిని ఉపయోగించి దఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ మందిర నిర్మాణంలో 150 మందికి పైగా కార్మికులు ఏడేళ్లుగా పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని నిర్మాణం వెనుక ఒక చరిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. ఈ పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే 1912లో జగన్నాథుడి నవకళేబర సమయంలో సుదర్శన్ చెట్టును ఫతేఘర్ నుండి సేకరించారు. దీనిని స్మరించుకునేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చి శ్రీరామ సేవా పరిషత్ అనే కమిటీని ఏర్పాటు చేశారు.

Ram Mandir
ఈ కమిటీకి సోషల్ యాక్టివిస్ట్ అయిన భాపూర్ బ్లాక్ వైస్-చైర్పర్సన్ అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఈ రామ మందిర పనులను ప్రారంభించారు. జనవరి 21వ తేదీ నుంచి ఈ రామమందిర ప్రారంభోత్సవ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిసింది. ఈ ఆలయ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా పూరీ శంకరాచార్య, మహారాజుకు ఆహ్వానం అందింది. అంతేకాదు పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఉన్న వారితో పాటు వివిధ ఆలయాల అధికారులకు ఆహ్వానాలు పంపబడ్డాయి.
ఈ ఆలయాన్ని కూడా అయోధ్యలో జరుగుతున్నంత వైభవంగా ప్రారంభోత్సవాన్ని జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.














శాంతా దేవీ ఎవరో కాదు. శ్రీరాముడి అక్క. ఈ విషయం చాలా మందికి తెలియదు. దశరథ మహారాజు, కౌసల్యల కుమార్తె శాంత దేవి. శాంతా దేవీకి ప్రత్యేకమైన జ్ఞానం కల అందమైన స్త్రీ. పురాణాల ప్రకారం, దశరథ మహారాజు శాంత దేవిని అంగదేశ మహారాజు రోమపాదకు దత్తత ఇచ్చాడు. రోమపాదుడు ఒకసారి దశరథుడిని కలవడానికి, భార్యతో పాటు అయోధ్యకు వచ్చాడు. అక్కడ దశరథుడి కుమార్తెను చూసిన రోమపాదుడు తమకు పిల్లలు లేరని బాధపడుతుండడం చూసిన దశరథుడు తన ఒక్కగానొక్క కుమార్తె శాంతను వారికి దత్తత ఇస్తాడు.
అలా అంగ దేశానికి శాంతా దేవీ యువరాణి అవుతుంది. ఒకసారి రోమపాదుడు తన కుమార్తె శాంతా దేవీతో మాట్లాడుతున్న సమయంలో ఓ బ్రాహ్మణ యువకుడు రాజు దగ్గరికి వర్షాకాల పంటను పండించడానికి సాయం అడగడానికి వచ్చాడు. అయితే రాజు ఆ యువకుడి విన్నపాలను పట్టించుకోడు. రాజు శ్యామ్ కోసం ఎదురుచూసిన ఆ యువకుడు అక్కడి నుండి వెళ్లిపోతాడు. తన భక్తుడిని రాజు పట్టించుకొకపోవడంతో వర్ష దేవత ఇంద్రాదేవి ఆగ్రహిస్తుంది. దాంతో రాజ్యంలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలంతా ఇబ్బంది పడతారు.
అప్పుడు రోమపాద మహారాజు ఋషిశృంగుని దగ్గరకు వెళ్లి యజ్ఞం చేయమని అడుగుతాడు. యజ్ఞం చేయడంతో వర్షాలు పడి, దేశంలో కరువు తగ్గుతుంది. అందుకు సంతోషించిన రోమపాదుడు శాంతా దేవీను ఋషిశృంగునికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. దశరథుడు సంతానం కోసం తలపెట్టిన పుత్రకామేష్ఠి యజ్ఞంను ఋషిశృంగుడు జరిపిస్తాడు. ఆ యజ్ఞం వల్ల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో కులులో శాంతా దేవీ, ఋష్యశృంగుని ఆలయం ఉంది. దేశం నాలుగు మూలల నుంచి భక్తులు వచ్చి శ్రీరాముడి అక్క శాంతాదేవిని పూజిస్తారు. విజయదశమి సందర్భంగా ఈ గుడిలో ప్రత్యేక పూజలను చేస్తారు.
500 ఏళ్ళ పోరాటం తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాకారం అయ్యింది. ఇది కోట్లాది మంది హిందువుల కల. అందువల్లే రామ మందిరం నిర్మాణం కోసం కోట్ల రూపాయల రామ భక్తులు అందించారు. అయోధ్య రామ మందిర నిధి సేకరణలో దేశంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రామమందిరం కోసం కావాల్సిన 118 దర్వాజాలు హైదరాబాద్ లోనే రూపొందాయి.
ఇక అయోధ్య రామయ్య కోసం బంగారు పాదుకలను తయారు చేసే అదృష్టం కూడా హైదరాబాద్ కే దక్కింది. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ వారు దాదాపు రూ.1.03 కోట్ల విలువ కల బంగారం పాదుకలను అయోధ్యకు పంపించింది. భక్తుల ఈ పాదుకలను శ్రీరామ భజనలతో పాదయాత్రగా తీసుకెళ్లారు. శ్రీ రాముడికి పాదుకలు తయారు చేసి పంపించడం తమ సంస్థ చేసుకున్న భాగ్యమని సీతారామ ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి వెల్లడించారు.
సుమారు పదమూడు కేజీల బరువుతో చేసిన వెండి పై బంగారు తాపడంతో తయారు చేసిన పాదుకలను సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో హస్మత్ పేటలోని శ్రీ మద్విరాట్ కళా కుటీర్ లో రూపొందించారు. లోహశిల్పి పిట్టంపల్లి రామలింగా చారి ఈ పాదుకలను ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి రూపొందించారు. ఆలయ ట్రస్ట్ ఈ బంగారు పాదుకలను ఇప్పటికే అయోధ్య రామ మందిరంకు చేర్చారు.
అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పీఎం మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఆయన చేతుల మీదుగా అయోధ్య రామమందిర గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ క్రమంలోనే జనవరి 12న అనుష్ఠాన కార్యక్రమాన్నిమొదలుపెట్టారు. అప్పుడే 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు నుండి ప్రధాని నరేంద్ర మోదీ కఠిన దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్షలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని మోదీ ఆహారం తీసుకోకుండా కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకుంటూ, నేలపై నిద్రపోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఈ దీక్షలో భాగంగా ఎనిమిదవ రోజు సైతం ఆహారం తినకుండా కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించాయి. మోదీ ఈ దీక్షలో భాగంగా కఠినమైన నియమాలు, వ్యాయామాన్ని పాటిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీ కఠిన దీక్షలో ఉన్నా, పర్యటనలు విస్తృతంగా చేస్తూనే ఉన్నారు. గత వారంలో కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పర్యటించి, పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. శంకుస్థాపనలు చేశారు. అంతే కాకుండా ఆ రాష్ట్రాలకు వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న పలు దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రతినిధిగా తనను ఆ అయోధ్య రాముడు ఎంపిక చేసుకున్నాడని ప్రధాని చెప్పుకొచ్చారు.
జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమయం కోసం యావత్ దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. సుమారు 150 -200 కిలోల బరువున్న రాముడి విగ్రహాన్ని తాజాగా ఊరేగింపుతో రామ మందిరానికి తీసుకువచ్చారు. ఈ విగ్రహాన్ని మైసూర్ కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ భాగ్యం తమకు దక్కినందుకు యోగిరాజ్ కుటుంబం సంతోష పడుతున్నారు.
ఈ క్రమంలో అరుణ్ యోగిరాజ్ భార్య విజేత తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె భర్త విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అతని కంటికి గాయం అయిన విషయాన్ని వెల్లడించింది. రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కే పనిని అరుణ్ యోగిరాజ్కి అప్పగించినప్పుడు, విగ్రహానికి అనువైన రాయి మైసూరు సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. అయితే అతను రాయి కోసం సైట్ ను సందర్శించినప్పుడు ఆ రాయి చాలా గట్టిగా ఉంది. విగ్రహాన్ని చెక్కుతున్న క్రమంలో ఒక పెచ్చు యోగిరాజ్ కంటికి గుచ్చుకుంది. దానిని తొలగించడానికి కంటి ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది.
విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ, దానిని భరిస్తూనే విగ్రహం చెక్కడాన్ని కొనసాగించాడని చెప్పుకొచ్చారు. చివరికి ఆయన కృషి, అంకితభావం, పనితనం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పుణ్యకార్యానని అప్పగించినందుకు తమ కుటుంబం ఆనందంలో మునిగిపోయిందని వెల్లడించింది.
