చూస్తుండగానే బిగ్ బాస్ మొదటి వారం అయిపోయింది.ఈ వారం నామినేషన్స్ లో భాగంగా మొదటి ఎలిమినేషన్ లో సరయు ఎలిమినేట్ అయ్యారు. రెండవ వారం నామినేషన్ ప్రక్రియ ఇవాళ జరగబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులని రెండు జట్లుగా డివైడ్ చేశారు.
ఇంటి సభ్యులు ఎవరిని అయితే నామినేట్ చేయాలి అనుకుంటున్నారో వారి ముఖంపై ఎర్రరంగుని పూస్తున్నారు. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
watch video :