అసలు ఎవరి జేవియర్ అనుకుంటున్నారు కదూ ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యూజర్లకి ఈయన ఎంతో సుపరిచితులే. ఆయన చేసిన హాస్యాస్పదమైన ట్విట్స్, కామెంట్స్ వల్ల ఆయన ఎంతో ప్రఖ్యాతి గాంచారు అంతేకాకుండా ఆయన ఫేస్బుక్ లో తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకొని అందులో ఆయన చేసిన ట్విట్స్ పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఆయన చేసిన ప్రతి ట్విట్కి ఎంతో మంది ఫాలోవర్స్ రియాక్ట్ అవుతూ ఉండే వారు దీని వల్ల ఆయన ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి గాంచారు .ఆయన అసలు పేరు పాకలుపాపిటో, ఈయన ఒక ఇండియన్ ఎలా ఒక గ్యాస్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవారు కానీ ప్రస్తుతం ఈయన విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు
ఈయన అసలు ఈ విధమైన హాస్యాస్పదమైన వ్యాఖ్యానాలు చేయడానికి కారణం ఏమిటి అని పరిశోధించే గా తెలిసిన విషయం ఏమిటంటే ఆయన ఒకానొక సమయంలో తన స్నేహితుడితో తాను రెండు రోజుల లోపు ఐదువేల ఫాలోవర్స్ తెచ్చుకుంటానని 10 వేల డాలర్లకు పందెం కాశారు. దీనిలో భాగంగానే ఆయన రకరకాల పోస్ట్ లలో హాస్యాస్పదమైన కామెంట్లను చేయడం ప్రారంభించారు అవి చాలా ఫేమస్ అయ్యాయి పందెంలో గెలిచి తన స్నేహితుని దగ్గర గెలుచుకున్న పదివేల డాలర్లతో ఆయన ఒక గ్యాస్ కంపెనీ ని కొనుక్కున్నారు. ఒకానొక సమయంలో ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఫాలోవర్స్ 8 లక్షలు వరకు, ఫేస్బుక్ పేజీలో 5 లక్షల వరకు పెరిగారు. కానీ తరువాత ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ఆయనని తన అకౌంట్ నుండి బ్యాన్ చేశాయి. కానీ దాని తర్వాత ఆయన పేరుతో చాలా రకాలైన అకౌంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి
ఈయనను మీ గురించి చెప్పండి అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఈ విధంగా ఉంది ” నేను జేవియర్ ని నేను నా సొంత గ్రహం భూమి నుండి వచ్చాను. నేను ఒక గ్యాస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కానీ ఆ కంపెనీ ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా భూమి పైన ఉంటుంది అని నాకు తెలుసు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నాకు పెళ్లి అయ్యింది. నా భార్య అంటూ ఉంటుంది నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని కానీ అలా ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఏదైతేనేం భార్యలకు అన్ని తెలుసు ” అంటు హాస్యాస్పదమైన రీతిలో సమాధానం ఇచ్చారు