ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తమ్ముడి కుమారుడు ఆశీష్ రెడ్డి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డి వివాహం రాజస్థాన్ జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో దిల్ రాజు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆశిష్ తన తమ్ముడి కొడుకు అయినా కూడా తన వారసుడు గానే ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అలాంటి తన వారసుడి పెళ్లిలో దిల్ రాజు తన మనవరాలు తో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియో ఒకటి వైరల్ కాగా ఇప్పుడు మరొక వీడియో బయటకి వచ్చింది. పెళ్లికి ముందు రోజు ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డి సంగీత్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో దిల్ రాజు షేర్వానీ ధరించి లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ పాటకి స్టెప్పులేస్తూ హైలైట్ గా నిలిచారు.
ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు ప్రముఖులు, సమక్షంలో పెళ్లి జరగడం వలన ఫిబ్రవరి 20న హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేశారు.ఈవెంట్ కి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి.
దిల్ రాజు స్వయంగా వారి నివాసాలకు వెళ్లి ఆహ్వానించారు. ఇక ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం సెల్ఫిష్ అనే సినిమాతో మరోసారి మన ముందుకి రాబోతున్నాడు ఆశిష్. ఈ సినిమా 2024 సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
#DilRaju dance For #HalamithiHabibo song at Ashish’s Sangeet Ceremony #Ashish #TeluguCinema #TeluguNews pic.twitter.com/JNNPQzuXmv
— srk (@srk9484) February 19, 2024