చంద్రుని కక్ష్యలోని ‘చలనం’ 18.6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయం లోనే ఎక్కువ గా ఆటుపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. అధిక ఆటుపోట్లు రావడం వలన వినాశానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఈ ప్రభావం 2030 సంవత్సర కాలం లో జరిగే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

దీని కారణం గా సముద్ర మట్టం పెరగడం తో పాటు, ఎక్కువ గా వరదలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భూమిపై ఆకస్మిక వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం భూమి కి పొరుగున ఉండే చంద్రుడి చలనాల కారణం గా ఆకస్మిక వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం జూన్ 21 న నేచర్ క్లైమేట్ చేంజ్ పత్రికలో ప్రచురించబడింది. ఈ వరదలను “న్యూసెన్స్ వరదలు” అని పేర్కొంటున్నారు.












