సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వింత ప్రపంచం. ఇక్కడ ఎవరికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో తెలియదు. ఎలా తరబడి కష్టపడ్డ ఒక్కొక్కరికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాదు. కానీ ఒక్కొక్కరికి మాత్రం ఒక చిన్న పాత్ర ఎంతో మంచి గుర్తింపు తీసుకువస్తుంది. తాజాగా ఈటీవి విన్ యాప్ లో #90’s వెబ్ సిరీస్ వచ్చింది.
ఈటీవీ విన్ యాప్ కు ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లు పెరగడంలో ఈ వెబ్ సిరీస్ కీలక పాత్ర పోషించింది.ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.1990 నుంచి 2000 మధ్య పుట్టిన వ్యక్తుల రియల్ లైఫ్ ను ప్రతిబింబించేలా ఉండటం ఈ వెబ్ సిరీస్ కు బాగా ప్లస్ అయింది. ఈ సీరీస్ లో నటించడం ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో మాస్టర్ రోల్ లో నటించిన నటుడు సందీప్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. తాజా ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ పలు విషయాలు పంచుకున్నాడు.
ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నా రూమ్ మేట్ అని సందీప్ వెల్లడించారు. ఈటీవి లో ప్రసారం అయ్యే జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేశానని ఆయన తెలిపారు.నా స్వస్థలం కామారెడ్డి అని ఇంటర్ లో ఇండస్ట్రీపై ఆసక్తి పెరిగిందని సందీప్ అన్నారు.చలాకీ చంటి ఛాన్స్ ఇచ్చారని సందీప్ వెల్లడించారు.డైరెక్టర్ తో ఉన్న స్నేహం వల్ల ఈ వెబ్ సిరిస్ లో ఛాన్స్ దక్కిందని అన్నారు.
ఆదిత్య హాసన్ కథలు చెప్పేవాడని ఆయన కథలు విని షాకయ్యేవాడినని సందీప్ పేర్కొన్నారు.కథ విని క్యారెక్టర్ అడగగా అడిషన్ చేసి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. జబర్దస్త్ లో ఎన్ని స్కిట్ లు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క వెబ్ సిరీస్ తో వచ్చింది అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.బయట అందరూ మ్యాథ్స్ టీచర్ అని పిలుస్తున్నారని సందీప్ తెలిపారు.