ఈరోజు ఉదయం తెలుగు నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ తుది శ్వాస విడిచారు. అకస్మాత్తు గా గుండెపోటు రావడం తో ఆయన ఈ లోకాన్ని వీడారు. కృష్ణ కుమార్ మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఆయన నిర్మించిన “అనుకోని అతిధి” సినిమా మరో రెండు రోజుల్లో ఓటిటి ప్లాట్ ఫామ్ పై విడుదల కావాల్సి ఉంది. ఆయన మరణవార్త గురించి రాస్తూ..” కుమార్ గారి మరణం హృదయాన్ని తొలిచేస్తోంది. ఆయన ఎంతో పాజిటివ్ గా ఉండే వ్యక్తి. నా శ్రేయోభిలాషి. ఆయనెప్పుడూ గుర్తుంటారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి..” అని పోస్ట్ చేసారు.












