మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహింద్ర మనందరికీ సుపరిచితమే. ఆయన సోషల్ మీడియా లో ఎక్కువ ఆక్టివ్ గా ఉంటారని మనందరికీ తెలుసు. ఆయన ఎవరైనా మంచి పని చేస్తే వారిని మెచ్చుకోవడం.. అవసరమైన వారికి తగిన సాయం అందించడం ఆయనకు హాబీ గా మారిపోయింది. ఈ క్రమం లోనే ఆయన సామాన్యులకు కూడా బాగా దగ్గరయ్యారు.

తాజాగా.. ఆయనను సోషల్ మీడియా లో ఓ వీడియో ఆకర్షించింది. ముంబై లో టౌక్తే తుఫాను కారణం గా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇంతటి వర్షం లో కూడా ఓ మున్సిపాలిటీ వర్కర్ తన పని తాను చేస్తోంది. బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితిలో.. ఆమె నిజాయితీ గా వర్షం లో రోడ్లు ఊడుస్తూ తన విధులు నిర్వర్తించింది. ఇది చూసి పలువురు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవడం తో.. అది చూసిన ఆనంద్ మహింద్ర ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు… ” ఇంతకంటే మోటివేషన్ మరొకటి ఉండదు.. బృహాన్ ముంబై మున్సిపాలిటీ అందరికి రైన్ కోట్లు అందిస్తుందని తెలుసు.. కానీ.. అవి అందరి వద్దా ఉన్నాయో లేదో మరో సారి చెక్ చేసుకోవాలి” అని ట్వీట్ చేసారు. బృహాన్ ముంబై మున్సిపాలిటీ కి ఆయన కోటి రూపాయల సాయం చేసారు.
Watch Video:
No question about it. No better motivation for today. And I know @mybmc provides them raincoats, but perhaps they can check again to ensure everyone has them… https://t.co/lpn13uKV3X
— anand mahindra (@anandmahindra) May 17, 2021










