రామ మందిరం వేడుకకి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి అన్న సంగతి తెలిసిందే. వారిలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందినవారు, ఇంకా ఇతర రంగాల్లో పేరు గాంచిన వారు కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఈ వేడుక కోసం భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి. తెలుగు సినిమా రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. వారిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు, ప్రభాస్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.
వీరితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో సంవత్సరాల నుండి సినిమాలు చేస్తూ, సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆహ్వానాలు అందిన ప్రతి ఒక్కరూ ఈ వేడుకకి హాజరు అవుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు అవ్వలేరు అని తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సినిమా బృందం అంతా కూడా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగానికి సంబంధించి ఇటీవల ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకి వెళ్లలేరు. షూటింగ్ బిజీ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యలోని రామ మందిరం వేడుకకి వెళ్లలేకపోతున్నారు అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బయట ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. సినిమా షూటింగ్ కూడా భారీ సెట్టింగ్స్ మధ్యలో జరుగుతోంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెటప్ కూడా డిఫరెంట్ గా ఉంది. గెటప్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్స్, విలన్ లుక్స్ ఇటీవల విడుదల చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తారు. కాబట్టి సినిమా షూటింగ్ షెడ్యూల్ అంత టైట్ గా ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ వార్త ప్రచారంలో ఉంది. మరి ఇదంతా నిజమేనా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారా? ఇది తెలియాలి అంటే మాత్రం వేడుక జరిగే రోజు వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లోనే ఉన్నారు.